నేడే ‘మన గుడి’ మహోత్సవం

నేడే ‘మన గుడి’ మహోత్సవం
పాత జ్ఞాపకానికి పూర్వ వైభవం
13,200 ఆలయాల్లో ప్రత్యేక పూజలు
హిందూ మత పరిరక్షణకు టీటీడీ కంకణం
మన ఊరి గుడిని పునరుద్ధరిద్దాం
తిరుపతి , ఆగస్ట్ 2 :
శివాలయం! ఆ పక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు! ఇటువైపు నవగ్రహాలు! వాటన్నిటి వెనక రామాలయం! ఉదయా న్నే కౌసల్యా సుప్రజా రామా అనే స్తోత్రంతో మేలుకొలు పు! శ్రీరామనవమి వస్తే పదిరోజులు పండగే పండగ! అర్ధరాత్రి వరకూ వీధి సినిమాలు! కార్తీక మాసంలో ఆధ్యాత్మిక కళ ఉట్టిపడేది! రుద్రాభిషేకాలతో మార్మోగేది! దసరా పది రోజులూ హోమాలూ, కుంకుమ పూజలతో కళకళలాడేది! ఇవే కాదు.. ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు! భజనలు, హరిక«థా గానాలు, వీధి నాటకాలు, పంచాయతీలు, రాజీలు.. అన్నిటికీ కేంద్ర బిందువు మన ఊరి గుడి!! గ్రామంలో ప్రతి వేడుకకూ అదే వేదిక! పాత తరం మదిలో చెరగని జ్ఞాపకం! నేటి తరానికి తెలియని పూర్వ వైభవం! సృష్టిలోని ప్రతి అణువులోనూ దైవం ఉన్నాడని విశ్వసించే హిందూ మతంలోకి ఇప్పుడు కొత్త ధోరణి వ్యాపించింది! ఫలానా ఆలయంలోనే సత్యమైన దేవుడున్నాడని, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే కోరిన కోర్కెలు ఇట్టే నెరవేరుతాయనే నమ్మకాలు ముదిరిపోయాయి.

ఫలితం గా కొన్ని ఆలయాలు ఎన్ని గంటలు తెరచి ఉంచినా భక్తుల బారులు తరగని స్థాయికి చేరుకోగా.. దశాబ్దాల తరబడి ఊరి ప్రజల నీరాజనాలందుకున్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు కరువయ్యాయి. చాలా గ్రామాల్లో ఆలయాలు, భజన మందిరాల తలుపులు తెరిచేవారు లేక బూజుపట్టి పోయాయి. ఇది మన ధార్మిక వ్యవస్థకే ముప్పని గ్రహించిన టీటీడీ ‘మన గుడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హిందూ ధర్మ వ్యాప్తికి, మానవీయ విలువల పరిరక్షణకు నిలయాలుగా భాసిల్లిన ఆలయాల కు పూర్వ వైభవం తేవాలని, మన సంస్కృతిని గుర్తు చేసి ప్రజానీకాన్ని జాగృతం చేయాలనే సంకల్పంతో బృహత్త ర కార్యక్రమం చేపట్టింది.

ఎక్కడికక్కడ ఊరి జనంతోనే ఆలయాల్లో పూజలు చేయించి పాత జ్ఞాపకాలను, కొత్త బాధ్యతలను గుర్తు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం, పౌర్ణమి కలిసి వచ్చిన శ్రావణ పౌర్ణమి పుణ్యదినాన రాష్ట్రవ్యాప్తంగా 13,200 ఆలయాల్లో ‘మన గుడి’ నిర్వహణ కు ఉపక్రమించింది. ఉత్సవ మూర్తులకు కొత్త వస్త్రాలతో పాటు నిర్వాహకులు, భక్తుల కోసం 85 లక్షల శ్రీవారి రక్షా కంకణాలు, పసుపు, కుంకుమ, అక్షతలు, ప్రసాదా లు మొత్తం 13 రకాల పూజా ద్రవ్యాలను ఇప్పటికే చేరవేసింది.

ఇక మిగిలింది ఊరి ప్రజల వంతే. శ్రీనివాసుని జన్మ నక్షత్రమైన శ్రవణం రోజున ఊరి గుడికి పట్టిన బూజును దులపాలి. అందరూ చేయిచేయి కలిపి పూర్వీకుల సమష్టి కృషికి చిహ్నంగా నిలచిన ఊరి గుడికి పూర్వ వైభవం తీసుకొస్తామని, తమ ముందు తరాల స్వేదంతో నిర్మించిన ఆలయ కట్టడాలను కలకాలం కళకళలాడేలా చూసుకుంటామని, ఆ సంస్కృతిని వారసత్వ సంపదగా భావితరాలకు అందజేస్తామని గుడిలోని మూలవర్ల సమక్షంలో ప్రతిజ్ఞ చేయాల్సి ఉంది. అప్పుడే టీటీడీ సంకల్పానికి సార్థకత లభిస్తుంది. అప్పుడే మళ్లీ గుడి గంటల గణగణతో పల్లె గుండె పులకిస్తుంది.

Advertisements

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2012/08/02/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a1%e0%b1%87-%e0%b0%ae%e0%b0%a8-%e0%b0%97%e0%b1%81%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%b9%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b5%e0%b0%82/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: