ఇక సెల్‌ఫోన్‌లో శ్రీవారు..!

ఇక సెల్‌ఫోన్‌లో శ్రీవారు..!
తిరుపతి , పిబ్రవరి 8 :
శ్రీవారి సేవలను ఇక నుంచి సెల్‌ఫోన్ల ద్వారా అందించాలని తితిదే యోచిస్తోంది. స్వామి సేవలను ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్‌లో భక్తులు విని తరించేందుకు, వీక్షించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రసారాల ద్వారా వచ్చే వాస్తవిక ఆదాయంపై దృష్టి సారిస్తోంది. రాబడి ఎలా ఉంటుందో అంచనా వేసేందుకు నిపుణుల సంఘాన్ని నియమించింది. శ్రీ వేంకటేశ్వర భక్తిఛానెల్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాలతో సహా వివిధ సేవలను సెల్‌ఫోన్లకు అనుసంధానించడానికి రూ.రెండున్నర కోట్ల దాకా చెల్లించేందుకు ఓ సంస్థ చేసిన ప్రతిపాదన తితిదేని కదిలించింది.

సుప్రభాతం, హారతి, అర్చన, తోమాల తదితర సేవలను ఇక సెల్‌ఫోన్‌ ద్వారా భక్తులు వినవచ్చు. 3జీ సెల్‌ఫోన్లలో ప్రత్యక్షంగానూ వీక్షించవచ్చు. ఈ మేరకు హక్కులను హైదరాబాదుకు చెందిన అపాల్యా టెక్నాలజీకి తితిదే లోగడే కట్టబెట్టింది. అందుకు నామమాత్రంగా రూ.ఐదు లక్షలలోపే ఆ సంస్థ సొమ్ము చెల్లించేది. ఇదే సమయంలో తితిదేకి తెలియకుండా స్పైస్‌ డిజిటల్‌ సంస్థతో ఆ సంస్థ అంతర్గత ఒప్పందం కుదుర్చుకుని దానికి ప్రసారాలను అప్పగించేసింది. ఈ విషయం తితిదే దృష్టికి రావడంతో లీగల్‌ నోటీసులు జారీ చేసింది. అంతలోనే ముంబయికి చెందిన విస్టాస్‌ డిజిటల్‌ మీడియా ప్రైవేట్‌ సంస్థ వారం కిందట ఓ ప్రతిపాదనను తితిదే ముందు ఉంచింది.

శ్రీవారి సేవల ప్రసారాలను తాము ‘డివైన్‌ ఇండియా సేవల’ పేరుతో సెల్‌ఫోన్లకు అనుసంధానించి భక్తులకు అందిస్తామని అందుకు ప్రతిగా ఏడాదికి రూ.2.5కోట్లదాకా చెల్లిస్తామనిపేర్కొంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఇవ్వజూపడంతో ఆశ్ఛర్యపోయిన దేవస్థానం అసలు తమ ప్రసారాలకు ఏమేరకు గిరాకీ ఉందో తెలుసుకోవాలని నిర్ణయించింది. దీంతో నిపుణుల సంఘాన్ని నియమించింది. రూ.2.5 కోట్లను ఇచ్చేందుకు ప్రతిపాదించిన సంస్థతో తొందరపడి ఒప్పందం చేసేసుకున్నాక తర్వాత అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఇస్తామని మరో సంస్థ ముందుకొస్తే ఇరకాటం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో నిపుణుల నివేదికను ఆధారంగా చేసుకుని పారదర్శకంగా ప్రసారాలను అప్పగించాలని తితిదే భావిస్తోంది.
సెల్‌ ప్రసారాలు ఇలా…
కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ భక్తులు సేవలను పొందేందుకు నెంబరు కేటాయిస్తుంది. దానికి కాల్‌ చేయగానే మన మాటలకు అనుగుణంగా (ఐవీఆర్‌ఎస్‌) స్పందిస్తుంది. కావాల్సిన సేవలను కోరిన సమయానికి వినిపిస్తుంది. ప్రత్యక్షంగా జరిగేటప్పుడు కావాలనుకున్నా అందిస్తుంది. కల్యాణం తదితర ఆలయం వెలుపల చేసే సేవలను ప్రత్యక్షంగా అందిస్తుంది. అర్చన, తోమాల వంటి మూలవిరాట్టుకు చేసే సేవలను మాత్రం నమూనా ఆలయంలో చిత్రీకరించిన వాటిని అందిస్తుంది. ప్రస్తుతం ప్రత్యక్షంగా వీక్షించే 3జీ సేవలు సంపూర్ణంగా అందుబాటులోకి రాలేదు. ముందస్తుగా ఐవీఆర్‌ఎస్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తుంది.

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2012/02/08/%e0%b0%87%e0%b0%95-%e0%b0%b8%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e2%80%8c%e0%b0%ab%e0%b1%8b%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: