21న కొల్హాపూర్‌లో శ్రీవారి వందో కల్యాణోత్సవం

21న కొల్హాపూర్‌లో శ్రీవారి వందో కల్యాణోత్సవం
తిరుపతి , జనవరి 11 :
నిత్యాకల్యాణ స్వరూపుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వందో కల్యాణోత్సవాన్ని ఈనెల 21న టీటీడీ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నిర్వహించనుంది. తిరుమల క్షేత్రానికే శ్రీవారి కల్యాణ వైభవం పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ప్రజలు తిలకించేలా ఐదేళ్ల కిందట టీటీడీ శ్రీవారి కల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టింది. కాగా, మహారాష్ట్రలో ఈనెల 20 నుంచి 29వరకు పది రోజులపాటు కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. వీటిలో 21న జరిగే కార్యక్రమం వందోది.

కాగా, 20న సతారా, 21న కొల్హాపూర్, 22, 26లలో పూణే, 23న నవీ ముంబై, 24న నాసిక్, 25న కల్యాణ్, 27, 28లలో ముంబై, 29న షోలాపూర్‌లో కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు.

శ్రీవారి పథకాలకు రూ. 12.11 లక్షలు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధించి వివిధ పథకాలకు భక్తులు మంగళవారం రూ. 12.11 లక్షలను విరాళంగా అందజేశారు. బెంగళూరుకు చెందిన కృష్ణ రూ.10 లక్షలు ప్రాణదాన పథకానికి, వెంకటరమణ రూ. 1.11 లక్షలను ఎస్వీ బాలమందిరానికి, పూణేకు చెందిన దినేష్ రూ. లక్షను నిత్యాన్నదాన ట్రస్టుకు అందజేశారు.

Published in: on January 12, 2012 at 12:43 pm  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2012/01/12/21%e0%b0%a8-%e0%b0%95%e0%b1%8a%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b9%e0%b0%be%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: