సకలప్రాణి ప్రియుడు..గోవిందుడే

సకలప్రాణి ప్రియుడు..గోవిందుడే
* తిరుప్పావై పాశురం-27
తిరుపతి , జనవరి 11 :
కూడారై వెల్లుమ్‌ శీర్‌ గోవిన్దా! ఉన్దన్నె
ప్పాడి ప్పరై కొణ్డు యామ్‌ పెరు శమ్మానమ్‌
నాడు పుకళుమ్‌ పరిశినాల్‌ నన్రాక
శూడకమే తోళ్‌వళైయే తోడే శెవిప్పూవే
పాడకమే ఎన్రనైయ ప్పల్‌ కలనుమ్‌ యామణివోమ్‌
ఆడై యుడుప్పోమ్‌ అదన్‌ పిన్నే పాల్‌ శోరు
మూడ నెయ్‌ పెయ్‌దు ముళంగైవళివార
కూడి యిరున్దు కుళిర్‌న్దు ఏలోరెమ్బావాయ్‌
పవిత్ర శ్రీవ్రతం 27వ రోజుకు చేరుకుంది. గోదాగోపికల సిరినోము ఫలించబోతున్నది. నందనందనుని కృపాకటాక్షములకు పాత్రులైన వీరు మార్గశీర్షస్నానానికి తమకు కావాల్సిన సాధన సంపత్తిని గత పాశురంలో కోరారు.
ఆరోజు పాశురంలో నోమునోచడం వల్ల లభించే పరమపురుషార్థమును వివరిస్తున్నారు.
నీ శత్రువులను కూడ నీ కల్యాణగుణగుణముల చేత జయించే శక్తి సామర్థ్యాలు గల ఓ గోవిందా! నిన్ను కీర్తించి నీ అనుగ్రహంచేత ీపర’అనే వాద్యమును పొంది ఈ వ్రతాన్ని సమాప్తం గావించి మేము పొందు సన్శానము లోకమంతా ప్రశంసించునట్లు గొప్పగా ఉండవలెను. దానికి విన్నవించెదము. చేతులనిండా గాజులు (హస్తకంకణములు), భుజములకు దండకండియలు, చెవులకు దుద్దులు, కర్ణపుష్పములు, కాలియందెల మొదలగు విధములైన ఆభరణములను మేము ధరించెదము. తరవాత కొత్త వస్త్రములను ధరించి అటు పిమ్మట మంచి సువాసన కలిగిన పరిమళ ద్రవ్యాలను చేర్చి వండిన క్షీరాన్నము మునుగునట్లు నేయిపోసి మోచేతి వరకు నెయ్యి జారునట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా ఆనందంగా భుజింపవలెను. ఇదే మా వ్రతఫలమని గోదాగోపికలు తమ మనోభీష్టమును శ్రీకృష్ణునికి విన్నవించిరి.
విశేషార్థం
1: ఇది ఒక విశేషపాశురం. గోపికలు శ్రీకృష్ణునితో కూడి భోగ రసానుభవానికై ప్రార్థించారు.
2: ఈ పాశురం మొదలుకొని మూడు పాశురాలలో అనగా మొత్తం 27,28,29 పాశురాలల్లో మూడు సార్లు ీగోవింద’ నామ సంకీర్తనం చేయబడుతున్నది. ీకేశవ నారాయణ శబ్దాదుల చేత మిగతా పాశురాలలో కీర్తించిన మూడు సార్లు మూడు పాశురాల ద్వారా ీగోవింద’ కీర్తనం చేయడం విశేషం.
3: తనతో కూడని వారని జయించేవాడు పరమాత్మ అంటే- ీసత్యేనలోకాన్‌జయతి, దీనాన్‌ దానేన రాఘవః, గురూన్‌ శుశ్రూషయావీరః, ధనుషా యుధి శాత్రవాన్‌’ అనే శ్లోకం స్మరించతగ్గది.
4: భగవంతునితో కూడని వారు నాలుగు విధాలుగా ఉంటారు.
1.పరమాత్మ సర్వజ్ఞడు, మనం అల్పజ్ఞులం అనే భావం కలవారు- ఆళ్వారులు
2. పరమాత్మతో ప్రణయరోషం చేత విముఖులగువారు- గోపికాదులు
3. పరమాత్మయందు భయ మాత్సర్యముల చేత ద్వేషించువారు-కంసాదులు
4. మైత్రీ, శత్రుత్వాదులు లేక ఔదాసీన్యంతో ఉండేవారు- మనబోటివారలు
5: ీగోవిందేతి సదా స్నానం గోవిందేతి సదాజపః గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనమే’ అనే శ్లోకం పఠనం చేత సర్వపాపాలు తొలగి పురుషోత్తముని పొందగలము.
6: శూడగమే: హస్తాభరణం-రక్షాబంధనము
7: భుజకీర్తులు- చక్రాంకనము
8: చెవిదుద్దులు- అష్టాక్షరీమంత్రం
9: కర్లపుష్పం-ద్వయమంత్రం
10: పాదాభరణం- చరమశ్లోకం
11: నూతన వస్త్రం-శేషత్వజ్ఞానం
12: క్షీరాన్నం- భగవత్‌ కైంకర్యం
13: నెయ్యి- పారతంత్రనజ్ఞానం
14: అనేక భరణములు- జ్ఞానం, భక్తి, వైరాగ్యాలు
15: కూడియిరున్దు- ీసః అశ్నుతే సర్వాన్‌ కామాన్‌ సహ, బ్రహ్మణావిపశ్చితా’ అని అన్నట్టు పరమాత్మతో కలిసి భోగాన్ని అనుభవించడం. ఇలా పూర్వాచార్యులు ఇంతటి విశేషార్థాలను అనుగ్రహించారు.
గోవిందనామ సంకీర్తనమే మోక్షదాయకమని ఆముక్త మాల్యద అమృతోక్తి.

Advertisements

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2012/01/12/%e0%b0%b8%e0%b0%95%e0%b0%b2%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a3%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-%e0%b0%97%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: