శ్రీకృష్ణపదప్రాప్తి..శరణాగతియే సాధనం

శ్రీకృష్ణపదప్రాప్తి..శరణాగతియే సాధనం
తిరుప్పావై పాశురం-28
తిరుపతి , జనవరి 12 :
కరవైకళ్‌ పిన్‌ శెన్రు కానమ్‌ శేర్‌న్దుణ్బోమ్‌
అరివొన్రు మిల్లాద అయ్‌కులత్తు ఉన్రన్నె
ప్పిరవి ప్పెరున్దనై పుణ్ణియమ్‌ యాముడైయోమ్‌
కురైవన్దుమ్‌ ఇల్లాద గోవిన్దా! ఉన్దన్నోడు
ఉరవేల్‌ నమక్క్గి ఒళుక్క ఒళుయాదు
అరియాద పిళ్త్లెగళోమ్‌, అన్బినాల్‌ ఉన్రన్నై
చ్చిరుపేరర్‌ అళుత్తనవుమ్‌ శీరి యరుళాదే
ఇరైవా! నీ తారాయ్‌ పరై ఏలోరెమ్బావాయ్‌
గోపీజన వల్లభుడైన శ్రీకృష్ణుని కోసం గోదాగోపికలు చేస్తున్న వ్రతం అప్రతిహతంగా కొనసాగుతోంది. పరమాత్మునితో కలిసి పరమాన్నమును భుజించాలని నిన్నటి పాశురంలో కోరారు. అలాగే పురుషోత్తముని ప్రాప్తి కోసం కావాల్సిన సమస్త సాధనములను వివరించారు.
ఈరోజు పాశురంలో ీనారాయణనే నమక్కే పరై తరువాన్‌’ అని మొదటి పాశురమున చెప్పిన ప్రాప్యప్రాపకములను తెలుపుతూ, నోము అనేది లోక సమ్మతం కోసం నోచినది కాని కృష్ణ పాదారవింద కైంకర్యమే మాకు ప్రధాన ఉద్దేశమని, ప్రాప్యుడు శ్రీకృష్ణుడే అని వెలిబుచ్చుతున్నారు.

ఓ కృష్ణా! మా జీవన విధానాన్ని నీకు తెలుపుతున్నాము. తెల్లవారి లేచి పశువులను మేపేందుకు అడవికి వెళ్లడం, గడ్డి ఉండే చోట వాటిని వదిలిపెట్టడం, శుచినియమాదులు లేక అక్కడే తిని తిరగడం, ఇదే మా నిత్యకృత్యము. కొంచెమైనను జ్ఞానంలేని గొల్లకులమున జన్మించాము. మేము చేసుకొన్న గొప్ప పుణ్యమేమిటంటే పరమ పురుషుడైన నీవు గోపాలబాలుడిగా అవతరించడం. మాకు సజాతీయుడవై నీవు ఉండడం మా సౌభాగ్య విశేషమే కదా! నీవు ఎలాంటివాడవు అంటే-ఎట్టి కొరతలేని నిరవద్య హృద్య స్వరూపుడైన గోవిందుడు కదా!ఓ గోపాలా! నీతోటి సంబంధం చాలా గొప్పది అద్వితీయమైనది కూడ. నీకును మాకును గల ఈ సంబంధం ఎన్నటికీ విడదీయరానిది. నిత్యమైనది పోగొట్టుకోవాలన్నా కూడా పోవునది కాదిది. ఓ స్వామి! మేము లోకజ్ఞానము లేని వారము. నిన్ను నానారకాలుగా పిలిచి ఉంటాము. అవన్ని పరాకుచే వచ్చిన బుద్ధిహీనత వల్ల చిన్న బాలికలమవడంతో వచ్చిన బుద్ధిమాంద్యం వల్ల, ప్రేమాధిక్యంచే వచ్చిన బుద్ధిహీనత వల్ల నిన్ను చిన్న చిన్న పేర్లతో పిలిచి తక్కువ చేసి మాట్లాడడం జరిగింది. కనుక దీనిని మనసులో పెట్టుకొనక, మా అజ్ఞానాపరాధములను క్షమించి మా ఈ వ్రతమునకు కావాలసిన ీపర’ అనే పురుషార్థమును ప్రసాదించి మమ్ములను అనుగ్రహించమని విన్నవించుకొన్నారు.
విశేషార్థం
1: కర్మ, జ్ఞాన, భక్తి యోగాదులను అనుష్టించలేని గొల్లకుల సంభూతలము. నీవే మాకు ప్రాప్యుడు. ఇది తప్పమాకేమి తెలియదు.

2: పశువులే మాకు గురువులు. అరణ్యవాసమే మాకు గురుకులవాసము.

3: కొరతలేని గోవిందా- సకల కల్యాణ గుణసాగరుడు, అవాప్త సమస్తకాముడు గోవిందుడే.

4: జీవాత్మకు పరమాత్మకు గల సంబంధం విడదీయరానిది. నిత్య సంబంధం కలిగినది.ుఈ సంబంధం తొమ్మిది రకాలుగా ఉంటాయి.

1. పితా-పుత్ర సంబంధం, 2.రక్ష్య-రక్షక సంబంధం, 3.శేష-శేషిభావ సంబంధం, 4.భర్తృ-భార్యాసంబంధం, 5.జ్ఞాతృ- జ్ఞేయసంబంధం, 6.స్వ-స్వామిభావ సంబంధం, 7.ఆధార-ఆధేయభావ సంబంధం, 8.శరీర-ఆత్మభావ సంబంధం, 9.భోక్తృ-భోగ్యభావ సంబంధం

5: అరియాద పిళ్త్లెగళోమ్‌ అన్బినాల్‌- శ్రీమద్భగవద్గీతలోని శ్లోకం స్మరింపతగ్గది. అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని సందర్శించిన తరువాత ీసఖేతి మత్త్వాప్రసభం యదుక్తం, హేకృష్ణ! హేయాదవ! హేసఖేతి! అజానతా మహిమానం తవేదం, మాయాప్రమాదాత్‌ ప్రణయేనవాపి’.

6: భగవంతుని పూజించిన తరువాత పూజలో ఏర్పడిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ శ్లోకం చదవడం సంప్రదాయం.
ీఉపచారపదేశేన కృతాన్‌ అహరహర్శయా అపచారాన్‌ ఇమాన్‌ సర్వాన్‌ క్షమస్వ పురుషోత్తమ’
శ్రీమన్నారాయణుని అనుగ్రహప్రాప్తికి శరణాగతి యే ప్రధాన సాధనమని విష్ణుచిత్తతనూజ శ్రీసూక్తి.

Advertisements

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2012/01/12/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%95%e0%b1%83%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3%e0%b0%aa%e0%b0%a6%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b6%e0%b0%b0%e0%b0%a3/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: