ధ్వజావరోహణంతో పరిసమాప్తం

ధ్వజావరోహణంతో పరిసమాప్తం
తిరుచానూరు , నవంబర్ 30 :
శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. ఈనెల 21వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు జరిగాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారు వివిధ వాహన సేవల్లో, వివిధ రూపాల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. చివరి రోజైన మంగళవారం ఉదయం 11.48గంటలకు పద్మసరోవరంలో అమ్మవారి ప్రతినిధిగా చక్రత్తాళ్వార్లకు పంచమితీర్థం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని గంగుండ్ర మండపానికి తీసుకొచ్చి అలంకరించి, విశేష పూజలు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. రాత్రి 7.30గంటలకు సర్వాలంకార శోభితురాలైన శ్రీపద్మావతి అమ్మవారు బంగారు తిరుచ్చిపై తిరువీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆగమశాస్త్ర నియమానుసారం అర్చకులు ధ్వజస్తంభంపై ఉన్న గజ చిత్రపటాన్ని అవరోహణం చేయడంతో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల నిర్వహణకు పాలపంచుకున్న పాంచరాత్ర ఆగమ పండితుడు తిరుమలాచార్యులు, ఇతర అర్చకులకు ఆలయ మర్యాదలతో సత్కరించారు.
నేడు పుష్పయాగం..
అమ్మవారి ఆలయంలో సాయంత్రం పుష్పయాగం నిర్వహించనున్నారు. ఉదయం పదిన్నర నుంచి 12 వరకు ఉత్సవమూర్తికి ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపం వద్ద స్నపన తిరుమంజనం జరుగుతుంది. సాయంత్రం ఐదింటి నుంచి ఏడు వరకు పుష్పాంజలి చతుర్వేద విన్నపం జరుగనుంది. పుష్పయాగానికి ఏడు టన్నుల పుష్పాలను వినియోగించనున్నారు. ఆర్జిత సేవా టికెట్‌ను కొనుగోలు చేస్తే ఇద్దరిని ఇందులోకి అనుమతిస్తారు.

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/11/30/%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b5%e0%b0%9c%e0%b0%be%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b9%e0%b0%a3%e0%b0%82%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d%e0%b0%a4/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: