కోటిజన్మల పుణ్యఫలం పంచమితీర్థం

కోటిజన్మల పుణ్యఫలం పంచమితీర్థం
తిరుచానూరు , నవంబర్ 30 :
శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన ఘట్టం పంచమి తీర్థం(చక్రస్నానం) మంగళవారం నేత్రపర్వంగా జరిగింది. కలియుగ దైవమైన శ్రీవెంకటేశ్వరస్వామి స్వయంగా తన కుంతాయుధంతో తవ్విన పద్మసరోవంలో కార్తీకమాసం, శుక్లపక్ష పంచమి తిథి, ఉత్తరాషాడ నక్షత్రంలో శుక్రవారం రోజున స్వర్ణకమలంలో అమ్మవారు పద్మావతీదేవిగా అవతరించి శ్రీవారికి అనుగ్రహం ప్రసాదించింది.

అమ్మవారు అవతరించిన పద్మసరోవరంలో ప్రతియేటా నిర్వహించే పంచమితీర్థం రోజున స్నానమాచరిస్తే సకల పాపాలు హరించుకుపోయి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున 3.30గంటలకు సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. 6.30 గంట లకు పల్లకి వాహన సేవ జరిగింది. 8 గంటలకు సన్నిధి మండపంలో అమ్మవారికి చూర్ణాభిషేకం నిర్వహిం చారు. అనంతరం అమ్మవారు, చక్రత్తాళ్వార్లను సన్నిధి నుంచి వేంచేపుగా పుష్కరిణిలోని పంచమితీర్థం మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు.

నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం
పంచమితీర్థం సందర్భంగా అమ్మవారికి శ్రీవారు సారెను పంపడం ఆనవాయితీ. సారె వచ్చిన తర్వాత అమ్మవారికి పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. అమ్మవారికి శ్రీవారి సారె వచ్చిన తర్వాత 11 గంటలకు పూజలు నిర్వహించారు. జియ్యర్ స్వాముల ఆధ్వర్యంలో ఆగమపండితులు తిరుమలాచార్యులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్నపన తిరుమంజనం నిర్వహించారు.

వైభవంగా చక్రస్నానం
స్నపన తిరుమంజనం అనంతరం ఉదయం 11.48 గంటలకు కుంభలగ్నంలో అమ్మవారి ప్రతినిధిగా చక్రత్తాళ్వార్లకు పంచమితీర్థం(చక్రస్నానం) వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పద్మసరోవరంలో పవిత్ర స్నానమాచరించి భక్తితో పులకించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వీ.సుబ్రమణ్యం, తిరుమల, తిరుపతి జేఈవోలు శ్రీనివాసరాజు, వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, అనంతపురం రేంజ్ డీఐజీ చారుసిన్హా, సీవీఎస్‌వో ఎంకే.సింగ్, ఆలయ డెప్యూటీ ఈవో గోపాలకృష్ణ, పేష్కార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/11/30/%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f%e0%b0%bf%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%81%e0%b0%a3%e0%b1%8d%e0%b0%af%e0%b0%ab%e0%b0%b2%e0%b0%82-%e0%b0%aa%e0%b0%82%e0%b0%9a%e0%b0%ae%e0%b0%bf/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: