పెద్దశేషవాహనంపై కనువిందు చేసిన అమ్మలగన్నమ్మ

పెద్దశేషవాహనంపై కనువిందు చేసిన అమ్మలగన్నమ్మ
తిరుచానూరు , నవంబర్ 23 :
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిక కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం ఉదయం సర్వాలంకార భూషితురాలై పెద్దశేషవాహనంపై మాడా వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. తెల్లవారుజామున 4గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవతో మేల్కోలిపి నిత్యార్చన వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 7 గంటలకు అమ్మవారి ఉత్సవ మూర్తిని వాహన మండపంలో పెద్ద శేషవాహనంపై అధిరోహింపచేసి కంకణభట్టు తిరుమాలాచారి ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య సాంప్రదాయబద్దంగా అలంకరించారు.

అనంతరం అమ్మవారిని తిరుమాడావీధుల్లో విహరింపజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి వాహన సేవకు ముందుగా గజములు, అశ్వాలు సైన్యంగా కదులుతుండగా భక్తులు చేసే భగవన్నామ స్మరణలు, కోలాటాలు, వాయిద్యాలతో తిరుచానూరు మారుమొమోగింది. భక్తులు మాడావీధుల్లో బారులు తీరి మంగళహారతులు పలికారు. పద్మావతీమాతకు కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. శేషుడు లక్ష్మీసహితుడైన శ్రీవారికి దాసుడిగా సఖుడిగా శయ్యగా, సింహాసనంగా, చత్రంగా, సమయోచితంగా సేవలు అందించే పెద్దశేషుని వాహనంపై అమ్మవారు విహరిస్తూ అలమేలు మంగమ్మకు వాహనమై తన విశేష, జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేశారు. ఓ తల్లీ మహాలక్ష్మి మగవాని యందలి భాగ్యలక్షణం నీఅంశం .

స్ర్తియందలి విలాస లక్షణం నీ అంశం, ఏనుగులు, గుర్రాలు, పక్షులు, పాములు మొదలగు వాటిల్లో విశిష్టమైన లక్షణాలు నీ అంశాలేనని, చెట్లు, చేమలు, పచ్చిక బయళ్లు , పశువులు వీటిలో ఒక్కొక్కదానిలో అసాధారణంగా గోచరించే సొంపులన్నీ నీఅంశలే కాని వేరుకావు అని అగస్థ్యుడు తన రచనలో ప్రస్తుతించినట్లు కంకణ భట్టాచార్య తెలియజేశారు. స్వామివారినే తన కనులయందు కల్గిన పద్మావతీ దేవి నేత్ర సౌందర్యాన్ని ఆది శంకరాచార్యులు మనోజ్ఞంగా ఆవిష్కరించారని కంకణభట్టాచార్యులైన తిరుమలాచార్యులు పెద్దశేషవాహనంపై విహార్తి భక్తులను కనువిందు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం, జేఇఓ వెంకట్రామిరెడ్డి, ఆలయ డిప్యూటి ఇఓ గోపాలకృష్ణ, సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, ఇన్స్‌పెక్టర్ ఆంజనేయులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/11/23/%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%b6%e0%b1%87%e0%b0%b7%e0%b0%b5%e0%b0%be%e0%b0%b9%e0%b0%a8%e0%b0%82%e0%b0%aa%e0%b1%88-%e0%b0%95%e0%b0%a8%e0%b1%81%e0%b0%b5%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: