తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఘనంగా అంకురార్పణ.నేడు ధ్వజారోహణం

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఘనంగా అంకురార్పణ.నేడు ధ్వజారోహణం
తిరుపతి , నవంబర్ 21 :
శ్రీవారి హృదయలక్ష్మి శ్రీపద్మావతీ అమ్మవారికి ప్రతి యేటా నిర్వహించే కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో ఆదివారం అంకురార్పణతో శాస్త్రోక్తంగా ప్రారంభమైయ్యాయి. ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆదివారం రాత్రి 6.30 గంటల నుండి 8.30 గంటల మధ్య అమ్మవారి సర్వసేనాధిపతి అయిన విశ్వస్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పద్మావతీ వనంలో పుట్టమన్నును సేకరించి ఆలయంలో అంకురింపజేసే పూజా కార్యక్రమాలనే అంకురార్పణ కార్యక్రమం అంటారు. విశ్వస్సేనుల ఊరేగింపు ముందు తిరువీధుల్లో దేదీప్యమానమైన వెలుగు జిలుగుల మధ్య గజ, తురగ, నంది కదులుతుండగా భక్తుల కోలాటాలు, భగవన్నామ స్మరణ మధ్య అత్యంత వైభవంగా ఊరేగింపును నిర్వహించారు.

వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరి మంగళ హారతులు అందించారు. అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ గావించారు. సోమవారం ఉదయం 9.30- 10 గంటల మధ్య జరిగే ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. కాగా అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం, జేఇఓ వెంకట్రామిరెడ్డి, సివిఎస్‌ఓ ఎంకెసింగ్,డిప్యూటి ఇఓ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తిరుచానూరుకు బ్రహ్మోత్సవ శోభ
శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుచానూరు నాల్గుమాడావీధుల్లోని ప్రతి ఇల్లు, ప్రతి దుకాణం పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. సోమవారం నుండి ప్రారంభమయ్యే అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను దృష్టిలో వుంచుకుని ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యులను చెయ్యాలన్న సదాలోచనతో టిటిడి ప్రతి ఇంటి ముందు రంగవల్లికలు, మామిడితోరణాలు,అరటి పందిళ్లు ఏర్పాటు చెయ్యాలని సంకల్పించింది. ప్రతి ఇంటికి కావాల్సిన మామిడి ఆకులను కూడా టిటిడినే అందించనుంది. మూడు రోజులకు ఒకసారి టిటిడి ఉద్యానవనశాఖ అధికారులు తిరుచానూరు సన్నిధి వీధి, తిరువీధులలోని ఇళ్లకు, దుకాణాలకు ఈ మామిడి తోరణాలను అందించనున్నారు. ఏవిధంగా అయితే ఇంటికి వచ్చిన అతిథిని సకల మర్యాదలు చేసి గౌరవించడం హైందవ సాంప్రదాయంలో అగ్రభాగంలో వుంటుందో అదేరీతిన 9 రోజుల పాటు ఉదయం, సాయంత్రం వివిధ వాహనాల్లో ఊరేగే అమ్మవారికి స్వాగతం పలకడంలో భాగంగా ప్రతి ఇంటి ముందు రంగవల్లికలు వెల్లివిరియనున్నాయి.

భక్తుల్లో సాంప్రదాయాన్ని పెంపొందించాలన్న మంచి యోచనతో టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వణాధికారి వెంకట్రామిరెడ్డి ఆదేశాలతో విద్యావిభాగం ఉన్నతశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారిణి పార్వతమ్మ నేతృత్వంలో ఈ నెల 21 నుండి 29వతేది వరకూ తిరుచానూరులో స్థానిక మహిళలకు ముగ్గుల పోటీలు టిటిడి నిర్వహించనుంది. ఇందుకు కావాల్సిన సామాగ్రిని అంతా టిటిడినే అందించనుంది. ఈ నేపధ్యంలో సన్నిధి వీధిలోని ఇళ్లు, తిరుమాడావీధుల్లోని దుకాణాలు సైతం ఉదయం ఒకసారి తిరిగి సాయంత్రం ఒకసారి వాహనానికి రెండు గంటల పూర్వమే ఆయా ఇంటి మహిళలు రంగవల్లికలతో తమ ముంగిళ్లను అందంగా తీర్చిదిద్దుతారు. అత్యద్భుతంగా ముగ్గులు వేసిన వారికి ఈ నెల 30న బ్రహ్మోత్సవాల అనంతరం టిటిడి ప్రోత్సాహాక బహుమతులను అందజేయనుంది. ఇదే రీతిలో ప్రజల్లో భక్త్భివనను, ధార్మిక చింతను పెంచాలన్న సంకల్పంతో ప్రతి వాహాన సేవ జరుగుతున్న సమయంలో స్థానికులతో పద్మావతీ నామావళి, శ్రీనివాస గద్య పారాయణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా టిటిడి నిర్వహించనుంది. ఇక అదేరీతిలో వాహన సేవ సమయంలో హారతులు అందించేందుకు వచ్చే మహిళలు,పురుషులు సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని టిటిడి ఆంక్షలు విధించింది.

Published in: on November 21, 2011 at 1:15 pm  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/11/21/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%9a%e0%b0%be%e0%b0%a8%e0%b1%82%e0%b0%b0%e0%b1%81-%e0%b0%aa%e0%b0%a6%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b0%a4%e0%b1%80-%e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: