శ్రీవారి దర్శనం ఇక సులభం

శ్రీవారి దర్శనం ఇక సులభం
తక్కువ సమయంలో దర్శనానికి అధ్యయనం
ఎనిమిది నెలల్లో ఒక రూపు
తిరుపతి , నవంబర్ 19 :

కలియుగ వైకుంఠం తిరుమల. ఏడు కొండలపై వెలసిన శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల వెళ్తుంటారు. దేశం నలుమూలలనుంచే కాకుండా ఇతర దేశాలనుంచి వచ్చే భక్తులు , వేలాది కిలోమీటర్లు ప్రయాణించే భక్తులు ఒక్క నిమిషం ఆ కోనేటి రాయుడిని దర్శించుకుని తరించిపోతారు. అంచనాలకు అందకుండా తరలివస్తున్న భక్తులతో స్వామివారి దర్శనం దొరకడం గగనమైపోతోంది. ఈ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు సాధారణ భక్తునికి కూడా తక్కువ సమయంలో మెరుగైన దర్శనాన్ని అందించడానికి అవసరమైన విధానాన్ని విశాఖలోని ఏయూ సాంఖ్యాక శాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ కె. శ్రీనివాసరావు , తిరుపతి ఎస్‌వీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ పి. రాజశేఖర్‌ రూపకల్పన చేస్తున్నారు. మరో 8 నెలలతో ముగియనున్న ఈ ప్రాజెక్టుతో వేంకటేశ్వరుడి దర్శనం సులభం కానుంది.

నిరీక్షణ సమయం తగ్గింపు

లఘు దర్శనంలో నిమిషానికి 40 మంది , మహాలఘు దర్శనంలో నిమిషానికి 75 మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. నిత్యం 40 వేలనుంచి 70 వేలమంది సెలవు రోజుల్లో సుమారు లక్షమంది వరకు భక్తులు వస్తుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలా లక్షలాదిగా తరలివస్తున్న భక్తులను క్యూలైన్లలో ఉంచడం సమస్యగా మారింది. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులను క్రమపద్ధతిలో పంపేందుకు అధ్యయనం జరుపుతున్నారు. దీనిద్వారా గరిష్టంగా రెండునుంచి 3 గంటల సమయంలో దర్శనం పూర్తయ్యే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

క్యూలైన్‌ ఎనలైజర్‌..

దర్శనానికి వెళ్ళే సమయంలో క్యూలైన్లలో భక్తులు వేచి ఉండే సమయం వీలైనంత వరకు తగ్గించడానికి సాంఖ్యాశ్రాస్త , గణాంకాలను వినియోగిస్తున్నారు. దీనికోసం మూడేళ్లుగా తిరుమలకు ఎంతమంది భక్తులు వచ్చారన్న వివరాలను సేకరించారు. నెల , తిథి , పండుగలు , ప్రత్యేక రోజులు ఇటువంటి వెన్నో దీనిలో పరిగణనలోకి తీసుకుంటున్నారు. క్యూలైన్లలో వివిధ సందర్భాల్లో దర్శనానికి పట్టే సమయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రిడిక్షన్‌ మెడల్‌ ద్వారా రాబోయే కాలంలో ఎంతమంది భక్తులు దర్శనానికి రానున్నారో అంచనా వేసి , వీటికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు. మేథమెటికల్‌ మోడలింగ్‌ , ప్రిడిక్షన్‌ అనాలసిస్‌ , క్యూలైన్‌ అనలైజర్‌ వంటి శాస్త్రీయ విధానాల్లో పరిశోధన చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని సూచనలు సిద్ధం చేశారు.

ప్రతి వ్యక్తికీ రిజిస్ట్రేషన్‌..

ప్రాథమికంగా కొన్ని సూచనలు సిద్ధం చేశారు. వీటి నిర్వహణ సాధాసాధ్యాలపై శ్రాస్తీయ విధానాల ద్వారా పరిశీలన చేస్తున్నారు. వీటిలో భాగంగా తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికీ రిజిస్ట్రేషన్‌ , నిర్ణీత సమయంలో దర్శనం కల్పించడం , సెల్‌ఫోన్‌ మెసేజ్‌ ద్వారా భక్తులకు వివరాలు అందించడం , ఎస్‌ఎంఎస్‌ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్‌ జరుపుకొనే సౌలభ్యం అందించడం వీటిలో ఒకభాగం. భక్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు గణిస్తూ రానున్నవారం , పక్షం , నెలరోజుల్లో ఎంతమంది రానున్నారో తెలయిజేసే విధానాన్ని కూడా రూపొందిస్తున్నారు. క్యూలైన్లలో భక్తులను దర్శనానికి పంపేందుకు పటిష్టం విధానం అమలు చేస్తారు.

వీఐపీల సంగతో…

ఈ విధానంలో ఏఏ రోజుల్లో ఎంతమంది భక్తులు వస్తున్నారు అన్న వివరాలు సేకరించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే తిరుమలకు నిత్యం వీఐపీల తాకిడి తప్పదు. అలావచ్చిన వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లతో గంటల తరబడి సమయం కర్పూరంలా హరించుకుపోతుంది. దీంతో అప్పటివరకు సజావుగా సాగిన సామాన్య భక్తుల దర్శన సమయంపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో శాస్త్రీయ పద్ధతిలో రూపొందిస్తున్న ఈ విధానం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

భక్తుల నిరీక్షణలేని దర్శనం ః ఆచార్య కె. శ్రీనివాసరావు , సాంఖ్యాశాస్త్ర విభాగ ఆచార్యుడు , ఏయూ

వీలైనంత వరకు భక్తులకు నిరీక్షణ సమయం తగ్గించి దర్శనం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విధానం పటిష్టంగా అమలుకు అధికారులకు సూచనలు అందిస్తాం. ఈ విధానం భవిష్యత్తులో ట్రాఫిక్‌ నియంత్రణ , పోర్టుల్లో కూడా వినియోగించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును మాకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ) సంస్థ అప్పగించింది

Advertisements

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/11/19/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b6%e0%b0%a8%e0%b0%82-%e0%b0%87%e0%b0%95-%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b0%ad%e0%b0%82/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. I’ve visited Tirumala two years ago with my family and suffered a lot waiting in queue lines for 11 hours. That helped me devise a new and easy model of Darshan. I’m ready to share with you all. One need not wait for more than 2-3 hours for Darshan. Pl take my views and I can devote my time if necessary.


Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: