రేపు అమ్మవారికి లక్ష కుంకుమార్చన

రేపు అమ్మవారికి లక్ష కుంకుమార్చన
తిరుచానూరు , నవంబర్ 19 :

తిరుచానూరులో కొలువైన శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించనున్నారు. లోక కల్యాణార్థం అమ్మవారి అష్టోత్తర శత (108) నామాలను లక్ష సార్లు జపిస్తూ ఈ సేవను నిర్వహిస్తారు. సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలు బాగా పండి, కర్షకులు, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, సకల జీవరాశులు సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తూ బ్రహ్మోత్సవాల ముందురోజు అమ్మవారికి ఈ అర్చన చేస్తారు. దాదాపు 16 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లక్ష కుంకుమార్చన చేస్తారు. ఈ సేవలో పాల్గొనదలచిన భక్తులు ఆలయంలోని టికెట్ కౌంటర్లో రూ.1,116 చెల్లించి సేవా టికె ట్‌ను కొనుగోలు చేయాలి. ఒక టికెట్‌పై ఇద్దరిని అనుమతిస్తారు. వీరికి వస్త్ర, అమ్మవారి ప్రసాదాలు, అమ్మవారి ప్రతిమ గల 5 గ్రాముల వెండి డాలర్‌ను ఇవ్వనున్నట్టు ఆలయ పేష్కార్ వేణుగోపాల్ తెలిపారు. ఈ సేవలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులతో రావాలని ఆయన కోరారు.

సాయంత్రం అంకురార్పణం

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ తేదీ ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా సవ్యంగా జరగాలని కోరుతూ ముందు రోజైన 20వ తేదీ సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. సేనాధిపతియైన విశ్వక్సేనుల వారిని ఊరేగింపుగా ఉద్యానవనానికి తీసుకెళ్లి అక్కడ పుట్టమన్నును సంప్రదాయబద్ధంగా సేకరించనున్నారు. ఆ మట్టిని ఆలయంలోకి తీసుకొచ్చి నవపాళికల్లో నింపి, అందులో నవధాన్యాలు వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టనున్నారు.

Advertisements
Published in: on November 19, 2011 at 12:22 pm  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/11/19/%e0%b0%b0%e0%b1%87%e0%b0%aa%e0%b1%81-%e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%95%e0%b1%81%e0%b0%82/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: