అంగరంగ వైభవంగా అమ్మవారి వేడుక

అంగరంగ వైభవంగా అమ్మవారి వేడుక
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం
త్వరలో ప్రదక్షిణంగా క్యూలైను నిర్మాణం
తిరుమల తరహా తిరుచానూరు గ్రామపంచాయతీ
తితిదే ఈవో ఎల్వీ సుబ్రమణ్యం
తిరుమల , నవంబర్ 19 :

తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామని తితిదే కార్యనిర్వహణాధికారి ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆయన వివరించారు.

?: పద్మావతీదేవి బ్రహ్మోత్సవాల నిర్వహణలో తీసుకుంటున్న చర్యలేమిటి.

ఈవో: శ్రీనివాసుడికి సమర్పిస్తున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని ఆరంభిస్తున్నాం. ముఖ్యమంత్రిని ఉత్సవాలకు ఆహ్వానించాం. హాజరుకాలేని పక్షంలో దేవాదాయశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పట్టువస్త్రాలు సమర్పిస్తారు. చేనేతసంఘాలు పట్టువస్త్రాలు వితరణ చేసే పక్షంలో అందుకోడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వాహనసేవల సందర్భంగా అమ్మవారిని భక్తులు దర్శించుకోడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఉత్సవాల ముగింపుగా పంచమితీర్థంనాడు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నాం.
?: అమ్మవారి ఉత్సవాల నిర్వహణకు సౌకర్యాల కొరత ఉంది కదా.
ఈవో: ఉత్సవాల్లో వినియోగించే అమ్మవారి వాహనాల కొరత ఉంది. వీటిని తయారుచేయించడానికి సన్నాహాలు చేస్తున్నాం. తితిదే మాజీ అధ్యక్షుడు టి.సుబ్బిరామిరెడ్డి రెండు గజరాజులను అందజేస్తామని ముందుకువచ్చారు. ఇలా అన్నింటిని సమకూర్చుకోడానికి చర్యలు తీసుకుంటున్నాం. గోశాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసి పాలు స్వయంగా ఉత్పత్తి చేసి అమ్మవారి కైంకర్యాలకు వినియోగిస్తాం.

?: తిరుచానూరులో పవిత్రతను కాపాడటానికి చేపట్టే చర్యలేమిటి.
ఈవో: తిరుమల గ్రామపంచాయతీ తితిదే పరిధిలో ఉంది. ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక చట్టం చేశారు. సర్పంచి స్థానంలో ఈవో బాధ్యతలు నిర్వహించారు. ఈ తరహా చట్ట పరిధిలోకి తిరుచానూరు పంచాయతీని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే మాంసం, మద్యం దుకాణాలను నిషేధించడానికి అవకాశం ఉంటుంది. పద్మసరోవరంలో పవిత్రతను పూర్తి స్థాయిలో కాపాడటానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ఉత్తరాది మఠాధిపతి శ్రీసత్యాత్మ తీర్థ స్వామిజీ తిరుమల, తిరుచానూరు పర్యటనలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విషయం రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం.

న్యూ: అమ్మవారి ఆలయంలో చేపట్టే మార్పులేమిటి?.
ఈవో: ప్రస్తుతం అప్రదక్షిణగా అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. పాంచరాత్రాగమానుసారం ప్రదక్షిణంగా వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంది. ఆలయ ప్రాంగణంలో పాదుకలు ధరించి నెలవైఉన్న శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి ఆలయాన్ని కలుపుతూ ప్రదక్షిణంగా క్యూలైను ఏర్పాటు చేయనున్నాం. తద్వారా భక్తులు ప్రదక్షిణంగా అమ్మవారిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. స్థల పురాణం మేరకు సంప్రదాయాన్ని పాటించినట్లవుతుంది. పాంచరాత్రాగమం మేరకు ప్రత్యేక వేద పాఠశాలను నెలకొల్పుతాం. వేదపారాయణం, మేళం విధానంలో మార్పులు తెస్తాం. తిరుమలేశుని ఆలయంలోని కొన్ని ఆభరణాలను అమ్మవారి సేవలకు వినియోగిస్తాం.

?: అన్నప్రసాద పథకం విస్తరణకు చేపట్టిన చర్యలేమిటి.
ఈవో: తిరుచానూరులో 1999లో అన్నప్రసాద పథకం ప్రారంభమైంది. 2009 నుంచి తిరుమల అన్నప్రసాదం ట్రస్టు కింద నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం శ్రీపద్మావతి అమ్మవారి నిత్య అన్నప్రసాదం ట్రస్టుగా మార్పు చేయనున్నాం. ప్రత్యేక విభాగం కింద ట్రస్టును ఆర్థికంగా బలోపేతం చేస్తాం.

Tags: ముఖ్యమైన వార్తలు,
Advertisements

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/11/19/%e0%b0%85%e0%b0%82%e0%b0%97%e0%b0%b0%e0%b0%82%e0%b0%97-%e0%b0%b5%e0%b1%88%e0%b0%ad%e0%b0%b5%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: