21నుంచి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

21నుంచి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు , నవంబర్ 13 :

తిరుచానూరులో కొలువైన శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి 29వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 15వ తేదీ ఉదయం కోయిల్‌ఆళ్వార్ తిరుమంజన సేవను నిర్వహించనున్నారు. 20న ఉదయం లోక కల్యాణార్థం లక్ష కుంకుమార్చన, సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. అనంతరం 21వ తేదీ నుంచి అమ్మవారు 9 రోజుల పాటు వివిధ వాహన సేవల్లో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.

వాహన సేవల వివరాలు

21వ తేదీ ఉదయం 9.30గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 8గంటలకు చిన్నశేష వాహనం, 22వ తేదీ ఉదయం 8 గంటలకు పెద్ద శేషవాహనం, రాత్రి 8 గంటలకు హంస వాహనం, 23న ఉదయం 8 గంటలకు ముత్యపు పందిరి వాహనం, రాత్రి 8 గంటలకు సింహ వాహనం, 24న ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనం, 25న ఉదయం 8.30 గంటలకు గజవాహనం, 26న ఉదయం 8 గంటలకు సర్వభూపాల వాహనం, సాయంత్రం 4.10 గంటలకు స్వర్ణరథం, రాత్రి 8.30 గంటలకు గరుడ వాహనం నిర్వహిస్తారు.

27న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 8గంటలకు చంద్రప్రభ వాహనం, 28న ఉదయం 7.50 గంటలకు రథోత్సవం, రాత్రి 8 గంటలకు అశ్వ వాహనం, 29న ఉదయం 6.30 గంటలకు పల్లకీ ఉత్సవం, 11.45 నుంచి మధ్యాహ్నం 12గంటలలోపు కుంభ లగ్నంలో పంచమీ తీర్థం(చక్రస్నానం) ఉంటాయి. 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు పుష్పయాగం ఉంటుంది. బ్రహ్మోత్సవాలల్లో ప్రతిరోజు మధ్యాహ్నం అమ్మ వారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్‌సేవ జరుగుతుంది.

ఆర్జిత సేవలు రద్దు
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీ, 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/11/15/21%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b1%80%e0%b0%95-%e0%b0%ac/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: