శ్రీవారి ఆలయం చెంత మరో ఉద్యానవనం

శ్రీవారి ఆలయం చెంత మరో ఉద్యానవనం
రూ.పది లక్షలతో అభివృద్ధి పనులు
తిరుమల , నవంబర్ 12 :

తిరుమల శ్రీవారి ఆలయం చెంత మరో ఉద్యానవనాన్ని తితిదే ఏర్పాటు చేసింది. లడ్డూ ప్రసాద వితరణశాలకు దక్షిణం వైపు ఖాళీ స్థలంలో వనాన్ని అందంగా తీర్చుదిద్దుతోంది. ఇది వరకే ఆలయానికి పడమర వైపున నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేసింది. ఇక్కడే మ్యూజికల్‌ వాటర్‌ పౌంటెన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. నిత్యం సాయంత్రం వేళ ఆరు నుంచి ఏడు గంటలు వరకు అన్నమయ్య కీర్తనలను వినిపించడంతోపాటు పౌంటెన్‌ను ప్రదర్శిస్తున్నారు. భక్తులకు కనువిందుగా ఉద్యానవనం అలరారుతోంది. లడ్డూ ప్రసాద వితరణశాల దక్షిణం పైపున ఖాళీ స్థలం ఉంది.

చెత్తాచెదారాలతో స్థలం నిండిపోతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఖాళీ స్థలంలో నిల్చొని స్వామివారి వాహన సేవలను చూసే భాగ్యం కల్పించడానికి పచ్చిక మైదానం ఏర్పాటు చేయాలని తలచారు. ఇందులో మొక్కలు కూడా పెంచాలని తితిదే నిర్ణయించి పనులు చేపట్టింది. దీంతో భక్తులకు అహ్లాదకర ఉద్యావనం మరొకటి అందుబాటులోకి వచ్చింది. శ్రీవరాహస్వామి ఆలయం వద్ద నుంచి కూడా ఉద్యానవనంలోకి వెళ్లే అవకాశం ఉంది. పడమర, ఉత్తర మాడవీధులకు ఆనుకుని లోభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఉద్యానవనం ఉంది.

Advertisements
Published in: on November 15, 2011 at 11:33 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/11/15/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%86%e0%b0%b2%e0%b0%af%e0%b0%82-%e0%b0%9a%e0%b1%86%e0%b0%82%e0%b0%a4-%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b-%e0%b0%89%e0%b0%a6/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: