ఫోటోలతో తిరుమల సేవా టిక్కెట్లు

ఫోటోలతో తిరుమల సేవా టిక్కెట్లు
తిరుమల , నవంబర్ 11 :

తిరుమలోని విజయాబ్యాంకులో కరెంట్‌ బుకింగ్‌ ద్వారా ప్రతిరోజు భక్తులకు మంజూరు చేస్తున్న సేవాటిక్కెట్లకు ఫోటోమెట్రిక్‌విధానాన్ని జేఈవో శ్రీనివాసరాజు గురువారం ప్రారంభించారు. గతంలో బయోమెట్రిక్‌ విధానంలో భక్తులనుంచి వేలిముద్రలు తీసుకుని సేవాటిక్కెట్లు కేటాయించేవారు. ఈ క్రమంలో కొన్ని అవకతవకలకు అవకాశాలు ఉన్నట్లు టిటిడి దృష్టికి వచ్చింది. దీంతో టిటిడి ఉన్నతాధికారులు సమగ్రంగా అధ్యయనం చేసి కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. సేవాటిక్కెట్లు మంజూరుచేసే సమయంలోనే భక్తులఫోటోలను పొందుపరచాలని విజయాబ్యాంకు సిబ్బందింని ఆదేశించారు. ఆ ప్రకారం బ్యాంకు యాజమాన్యం ఏర్పాట్లను పూర్తిచేసింది. ఈ విధానంతో భక్తుల ఫోటోలు కూడా సేవాటికెట్లపై ముద్రిస్తారు. వైకుంఠం క్యూకాంప్లెక్సులోని విచారణలో టిక్కెట్లపై ఉన్న ఫోటోల్లోని భక్తులనే లోపలకు అనుమతిస్తారు.

పొర్లు దండాలపై

నిత్యం సుప్రభాతం వేళ ఆనంద నిలయం చుట్టూ పొర్లు దండాలు చేయడానికి 750 మంది భక్తులను అనుమతిస్తున్నారు. ఈ టోకన్ల జారీలోనూ అక్రమాలు జరుగుతున్నాయని భక్తులు ఈవో దృష్టికి తెచ్చారు. త్వరలో వీటిపై కూడా ఫోటోలు ముద్రించి జారీ చేయాలని సంకల్పించారు

Advertisements

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/11/15/%e0%b0%ab%e0%b1%8b%e0%b0%9f%e0%b1%8b%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%ae%e0%b0%b2-%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5%e0%b0%be-%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: