కల్యాణమస్తుకు టిటిడి మంగళం

కల్యాణమస్తుకు టిటిడి మంగళం !
తిరుపతి , నవంబర్ 10 :

బిడ్డల పెళ్లి కారణంగా పేద కుటుంబాలు అప్పులపాటు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో తిరుమల-తిరుపతి దేవస్థాంన 2007లో ప్రారంభించిన కళ్యాణమస్తుకు మంగళం పాడటానికి ప్రస్తుత పాలకమండలి రంగం సిద్ధం చేసింది. గతంలోలాగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా నిత్యకల్యాణం పేరుతో తిరుమలలో మాత్రమే ఉచిత వివాహాలు జరిపించాలని టిటిడి యోచిస్తోంది. అయితే , తిరుమలతోపాటు తన యోజక వర్గంలోని తరిగొడంలో కూడా నిత్యకల్యాణాలు జరిపించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి టిటిడి ఉన్నతాధికారులను ఆదేశించడం గమనార్హం. 2007 ఫిబ్రవరిలో కల్యాణమస్తుకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిపి పేదలకు తాళిబొట్లు , మెట్టెలు ,పెళ్లి దుస్తులు , పెళ్లికి అవసరమయ్యే సామగ్రి , మంగళవాయిద్యాలు ఉచితంగా ఏర్పాటుచేసి ఏడాదికి రెండుసార్లు సామూహిక వివాహాలు జరిపించింది. 

దీంతోపాటు పెళ్ల్లి కొడుకు , పెళ్లి కూతురు కుటుంబాలకు చెందిన 60 మందికి పెళ్లి భోజనం కూడా అందించింది. ఆరు విడతల కల్యాణమస్తు వివాహాల్లో 35 వేల పైగా జంటలు ఒక్కటయ్యాయి. గత పాలకమండలి ఈ కార్యక్రమంలో మార్పులు చేసే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చి చివరకు విరమించుకుంది. తరువాత ఏర్పాటైన స్పెసిఫైడ్‌ అథారిటీ కల్యాణమస్తు ట్రస్టును రద్దు చేసింది. ప్రస్తుతం కార్యక్రమాన్ని పూర్తిగా ఎత్తివేయకుండా తిరుమల , తరిగొండలో మాత్రమే నిత్య కల్యాణం జరిపించడానికి టిటిడి సమాయత్తమవుతోంది. 

Advertisements

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/11/10/%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%9f%e0%b0%bf%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%82%e0%b0%97/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: