అభిషేకం, వస్త్రం టికెట్ల భక్తులు ముందు రోజే హాజరు కావాలి

అభిషేకం, వస్త్రం టికెట్ల భక్తులు ముందు రోజే హాజరు కావాలి
తిరుపతి , అక్టోబర్ 29 :

శ్రీవారికి ప్రతి శుక్రవారం నిర్వహించే అత్యంత విశిష్ట సేవలైన అభిషేకం, వస్త్రం ఆర్జిత సేవా టికెట్లు కలిగిన భక్తులు గురువారం రాత్రి 8 గంటల లోపు హాజరు కావాలని టీటీడీ తిరుమల జేఈవో కెఎస్.శ్రీనివాసరాజు విజ్ఞప్తి చేశారు. తిరుమల అన్నమయ్య భవన్ అతిథి గృహంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారికి ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేకం, వస్త్రం వంటి ఆర్జిత సేవలకు అడ్వాన్స్ బుకింగ్ ఇది వరకే టికెట్లు కేటాయించారు. వీటితో కలిపి టీటీడీ ఉన్నతాధికారుల విచక్షణ కోటా కింద మొత్తం 165 టికెట్లు మంజూరు చేస్తారు. ఇందులో సుమారు 30 శాతం అంటే 50 టికెట్ల భక్తులు గైర్హాజరవుతున్నట్టు అధికారులు గుర్తించారు.

ఈ గైర్హాహజరీ శాతాన్ని తగ్గించేందుకు అడ్వాన్స్ బుకింగ్‌లో టికెట్లు పొందిన భక్తులు ముందు రోజే అంటే గురువారం రాత్రి 8 గంటలకు ఎంబీసీ-34 కేంద్రం వద్ద హాజరు కావాలని రెండు నెలల ముందే నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా సంబంధిత భక్తుల పూర్తి వివరాలు సేకరించి ఫొటోమెట్రిక్ పద్ధతిలో తిరిగి ఫొటోలు తీసుకోవాల్సి ఉంది. ఈ సమయంలోగా హాజరుకాని భక్తుల అభిషేకం, వస్త్రం టికెట్లను రద్దు చేసి రాత్రి 8.30 గంటలకు విజయా బ్యాంకు కరెంట్ బుకింగ్‌లో రెండో దఫా లక్కీడిప్ పద్ధతిలో సామాన్య భక్తులకు కేటాయిస్తారు. ఒకవేళ లక్కీడిప్‌లో లభించినప్పటికీ సంబంధిత భక్తుడు టికెట్టు తీసుకోకపోతే రాత్రి 10.30 గంటల తర్వాత మిగిలిపోయిన టికెట్లను అధికారుల విచక్షణ కోటా కింద సిఫారసులపై కేటాయిస్తారు. నవంబరు నెల మొదటి వారంలో 4వ తేదీ శుక్రవారం నిర్వహించే అభిషేకం, వస్త్రం సేవలకు 3వ తేదీ రాత్రి 8 గంటల్లోగా ఎంబీసీ-34 కేంద్రంలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కొత్త విధానం నిబంధనలు అడ్వాన్స్ బుకింగ్‌లో టికెట్లు పొందిన భక్తులకు ఇప్పటికే లేఖల ద్వారా తెలియజేశామన్నారు. ఆర్జిత సేవలు కేటాయించే లక్కీడిప్ పద్ధతి సక్రమంగా అమలు కావడం లేదని ఫిర్యాదులు అందడంపై జేఈవో సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా తిరుమల పరిధిలోని మఠాల్లో ఏవైనా ఆక్రమణలు ఉంటే రెండు నెలల్లోగా తొలగించాలని జేఈవో శ్రీనివాసరాజు అన్నారు. ఆక్రమణలు ఉన్నా, లేకున్నా టీటీడీ నిబంధనల ప్రకారం అన్ని మఠాలకు నోటీసులు పంపి నిర్వాహకుల వివరణ కోరామన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీతో పాటు మఠాల్లో ఖాళీగా ఉన్న గదుల్లో 30 శాతం గదులను టీటీడీ కేటాయిస్తుందని స్పష్టం చేశారు. దీనిపై మఠాల నిర్వాహకులు కూడా సానుకూలంగానే స్పందించారని, ఎట్టి పరిస్థితుల్లోనూ మఠాల నిర్వహణలో టీటీడీ జోక్యం చేసుకోదని జేఈవో చెప్పారు. పాత అన్నదానం కాంప్లెక్స్‌ను లగేజీ కేంద్రంగా మార్పు చేశామని చెప్పారు.

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/10/29/%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%b7%e0%b1%87%e0%b0%95%e0%b0%82-%e0%b0%b5%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: