ఏటీఎం తరహాలో శ్రీవారి లడ్డూలు

ఏటీఎం తరహాలో శ్రీవారి లడ్డూలు
నాలుగు రోజుల్లో యంత్రాల రాక
తిరుమల , అక్టోబర్ 29 :

ఏటీఎం ద్వారా నగదు తీసుకున్నట్లుగా శ్రీవారి లడ్డూల ప్రసాదం పొందే అవకాశం భక్తులకు అందుబాటులోకి రానుంది. ఈ ప్రక్రియకు తితిదే ప్రయోగాత్మకంగా నాలుగు రోజుల్లో శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన యంత్రాలు బెంగళూరు నుంచి త్వరలో తిరుమలకు రానున్నాయి. సిబ్బంది భారం తగ్గించుకోవడం, అక్రమాలు నివారించడంలో భాగంగా తితిదే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సంకల్పించారు. కాగితం వినియోగం నిలిపివేసి బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. కుడిచేతి చూపుడు వేలిముద్రను సేకరించి ఛాయాచిత్రాన్ని నిక్షిప్తం చేస్తారు. ఈ ప్రక్రియ నిర్వహించే చోట లడ్డూలకు నగదు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం లడ్డూ వితరణ కేంద్రానికి వెళ్లి వేలిముద్ర వేయగానే లడ్డూలు వెలుపలికి వస్తాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం విజయవంతమైతే శ్రీవారి దర్శనం టిక్కెట్లకు స్వస్తి పలికి బయోమెట్రిక్‌ విధానాన్ని విస్తరించాలని సంకల్పించింది.

Advertisements

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/10/29/%e0%b0%8f%e0%b0%9f%e0%b1%80%e0%b0%8e%e0%b0%82-%e0%b0%a4%e0%b0%b0%e0%b0%b9%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b2%e0%b0%a1/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: