శాస్త్రోక్తంగా పవిత్రాల సమర్పణ తిరుచ్చి వాహనంపై శ్రీహరి విహారం

శాస్త్రోక్తంగా పవిత్రాల సమర్పణ
తిరుచ్చి వాహనంపై శ్రీహరి విహారం
తిరుమల , అక్టోబర్ 24 :

వైఖానస ఆగమోక్తంగా వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు నడుమ కల్యాణ వెంకన్నస్వామికి, పరివారదేవతలకు, యజ్ఞ, యాగకుండలాలకు పవిత్రాలను సమర్పించారు. శ్రీనివాసమంగాపురంలో కొలువున్న కల్యాణవెంకన్న స్వామివారి పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం వేకువజామున సుప్రభాత సేవలతో స్వామివారిని మేల్కొలిపి నిత్యకట్ల కైంకర్యపూజలు నిర్వహించారు. కల్యాణ మండపానికి వేంచేపుగా చేరుకున్న స్వామివారి ఉత్సవర్లకు దవళవస్త్రాలను అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. ఈ సందర్భంగా ఉత్సవర్లకుతిరుమంజనం నిర్వహించారు. వేదపండితులు పవిత్రాలను ఆలయానికి ప్రదర్శనగా తీసుకువచ్చి నిజాలయంలోని స్వామివారికి సమర్పించారు. యాగశాలలో ఉత్సవర్లుకు కలశ కుండాలకు, పవిత్రాలను సమర్పించి వివిధ హోమాలు నిర్వహించారు.

అలంకృతులైన స్వామివారు సాయంత్రం పుష్ప ఊయలలో కొలువుదీరి భక్తజనులను తన్మయపరచారు. అనంతరం తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి సంకల్పపూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారు తిరుచ్చి వాహనంలో తిరువీధుల్లో ఊరేగారు. రాత్రి 9.30 గంటలకు శుద్ధి, ఏకాంతసేవలతో స్వామివారికి పవళింపుసేలు నిర్వహించారు. కార్యక్రమంలో తితిదే ఈవో ఎల్వీ సుబ్రమణ్యం, సీవీఎస్‌వో ఎంకే సంఘ్‌, డిప్యూటీవో ఝాన్సీరాణి, విశ్రాంత డిప్యూటీఈవో వాసుదేవన్‌, ఏఈవో సుబ్రమణ్యం, కంకణభట్టర్‌ సుందరవరద భట్టాచార్యులు, వైఖానస ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఆలయ సూపరిటెండెంట్‌ దొరస్వామి, ఆలయ ఇన్‌స్పెక్టరు నటరాజ, ఆర్జితసేవా ఇన్‌స్పెక్టర్లు నందగోపాల్‌, మాధవయ్య తదితరులు పాల్గొన్నారు.

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/10/25/%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%aa%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: