శ్రీనివాసమంగాపురానికి మహర్దశ: తితిదే ఈవో

శ్రీనివాసమంగాపురానికి మహర్దశ: తితిదే ఈవో
శ్రీనివాసమంగాపురం , అక్టోబర్ 24 :

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణవెంకన్న ఆలయ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తితిదే ఈవో ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలకు ఆయన సతీమణితో హాజరై స్వామివారికి పవిత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ తితిదే పరిధిలోని దేవాలయాలను అభివృద్ధిపరిచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టిందన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తితిదే పరిధిలోని దేవాలయాలను సందర్శించే విధంగా కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. కల్యాణవెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలకు వాహనాలు లేనికారణంగా తిరుపతిలోని గోవిందరాజస్వామి, తిరుచానూరులోని శ్రీపద్మావతిదేవి దేవాలయాల నుంచి తెప్పించి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇకపై ఆలయాలనికి శాశ్వతంగా అన్నిరకాల వాహనాలు తయారుచేసి సమకూర్చుతామన్నారు.

తిరుమలలో శ్రీవారికి జరిగే స్వర్ణపుష్పార్చన, అష్టోత్తర శతకలశాభిషేకం, తిరుప్పాడ (అన్నకూటోత్సవం), అభిషేకం(వస్త్రసమర్పణ), నిత్య కల్యా ణోత్సవం, తిరుచ్చివాహనసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను శ్రీనివాసమంగాపురంలో ప్రవేశపెట్టడం ద్వారా భక్తులు ఉపయోగకరంగా ఉన్నట్లు తెలిపారు. తిరుమలలో ఆర్జిత సేవలు పొందలేని భక్తులు శ్రీనివాసమంగాపురంలోని కల్యాణవెంకన్న స్వామివారికి జరిపించుకుని మొక్కులు తీర్చుకోవాలని కోరారు. ప్రస్తుతం శ్రీనివాసమంగాపురం నుంచి శ్రీవారిమెట్టు వరకు ఉచితంగా యాత్రికులను తరలించే బస్సును చంద్రగిరి నుంచి శ్రీవారిమెట్టు వరకు నడచేవిధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగానే చంద్రగిరికి చెందిన స్వామివారి భక్తులు చేగు లక్ష్మీనారాయణగుప్త శుక్రవారం స్వామివారికి జరిగే అభిషేకం సేవలకు టికెట్టు ధర రూ.500 ఉందని, కేవలం ఒక్కరినే అనుమతించడం కంటే ఒక టికెట్టుపై దంపతులు(జంట)ను అనుమతించాలని ఈవోను కోరారు. సమావేశంలో సీవీఎస్వో ఎంకే సింఘ్‌, డిప్యూటీవో ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisements

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/10/25/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b8%e0%b0%ae%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ae/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: