తిరుమలలో 26 న దీపావళి ఆస్థానం

తిరుమలలో 26 న దీపావళి ఆస్థానం
తిరుమల , అక్టోబర్ 21 :

శ్రీవారి ఆలయంలో ఈనెల 26 న దీపావళి ఆస్థానాన్ని తితిదే ఘనంగా నిర్వహించనుంది. ప్రతిఏటా అశ్వయుజ మాసం అమావాస్య రోజన దీపావళి వస్తుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఉదయం ఏడింటినుంచి తొమ్మిదింటి వరకు బంగారువాకిలి ముందు ఘంటామండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. శ్రీదేవి , భూదేవి సమేత శ్రీమలయప్పస్వామిని గరుడాళ్వారుకు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి శ్రీవిష్వక్సేనులను స్వామివారికి ఎడమ వైపున మరోపీఠంపై దక్షిణముఖంగా ఏర్పాటు చేస్తారు. స్వామివారికి ప్రత్యేక పూజ , హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆస్థానం సందర్భంగా శ్రీవారికి సహస్ర కలశాభిషేకం , కల్యాణోత్సవం , ఊంజలసేవ , వసంతోత్సవం , ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను తితిదే రద్దు చేసింది.

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/10/23/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%ae%e0%b0%b2%e0%b0%b2%e0%b1%8b-26-%e0%b0%a8-%e0%b0%a6%e0%b1%80%e0%b0%aa%e0%b0%be%e0%b0%b5%e0%b0%b3%e0%b0%bf-%e0%b0%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: