ఆర్టీసీ వారి శీఘ్ర దర్శనం

ఆర్టీసీ వారి శీఘ్ర దర్శనం
తిరుమల వెళ్లే భక్తులకు ప్రత్యేకం
తితిదేతో ఒప్పందానికి ప్రయత్నం
ప్రయాణికుల ఆదరణకు వినూత్న పథకాలు
హైదరాబాద్ , అక్టోబర్ 20 :

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు ప్రయాసపడవల్సిన అవసరంలేదు. తిరుపతికి వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే చాలు. శ్రీవారి శీఘ్ర దర్శనం, తిరుమలలో వసతికి అవసరమైన ఏర్పాట్లన్నిటినీ ఆ సంస్థే సమకూర్చనుంది. దీనికి గాను ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రయాణికులకు సాధ్యమైనంత మేరకు మంచి సౌకర్యాలు కల్పించటం ద్వారా ప్రజల ఆదరణ చూరగొని తమ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెంచుకోవాలని ఆర్టీసీ అధికారులు కొద్ది కాలంగా ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్లే ప్రయాణికులకు శ్రీవారి శీఘ్రదర్శనం టిక్కెట్లను అందజేస్తే బాగుంటుందని అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పర్యాటక శాఖ.. తితిదేతో ఒప్పందం చేసుకోవటం ద్వారా ప్రతిరోజూ 400 శీఘ్రదర్శనం టిక్కెట్లను, రూము వసతిని తమ బస్సుల్లో వచ్చే పర్యాటకులకు అందజేస్తోంది.

దీనిని గమనించిన ఆర్టీసీ అధికారులు ఈ తరహా సేవలను వేలాదిగా తమ బస్సుల్లో ప్రయాణించే భక్తులకు కల్పిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. స్వామివారి శీఘ్ర దర్శనం కోసం ఇబ్బందులుపడకుండా తమ ప్రయాణికులకూ టిక్కెట్లు అందజేసేందుకు సహకరించాలని ఆర్టీసీ ఎండీ బి.ప్రసాదరావు తితిదే ఈవోకు నెల రోజుల కిందట లేఖ రాశారు. తిరుమల-తిరుపతికి భక్తులను చేరవేయడంతో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తుంది కనుక ఆర్టీసీ అభ్యర్థనకు తితిదే సుముఖంగానే స్పందించవచ్చని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ఈ విషయంలో అవసరమైతే సీఎం సహకారాన్నీ తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది.

రోజుకు కనీసంగా అయిదారు వేల శీఘ్ర దర్శనం టిక్కెట్లనైనా పొందాలని ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఒక్కో శీఘ్రదర్శనం టిక్కెట్‌ను తితిదే రూ.300లకు విక్రయిస్తోంది. తితిదే ఈ టిక్కెట్లను ఇస్తే ప్రయాణికుల నుంచి ఈ మేరకు అదనంగా వసూలు చేయాలా బస్సు టిక్కెట్‌ ధరలోనే చేర్చాలా అన్న విషయమై అధికారులు చర్చిస్తున్నారు. తితిదే నుంచి సానుకూల స్పందన రాగానే తిరుమల ప్రయాణిలకు శీఘ్రదర్శనం టిక్కెట్లను పంపిణీ చేసేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ఈ సదుపాయం వల్ల తమ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోవడం ఖాయమని అధికారులు అంచనావేస్తున్నారు.

పర్యాటకశాఖతో ఒప్పందానికి ప్రయత్నాలు….

ప్రస్తుతం ఆర్టీసీ ప్రయాణికులకు తిరుపతిలో కొన్ని రూములను తితిదే కేటాయిస్తోంది. అయితే, మరింత ఆధునిక వసతులున్న రూములను ప్రయాణికులు కోరుకొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తిరుపతిలో పర్యాటక సంస్థకున్న ఆధునిక వసతులను వినియోగించుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. దీనికి గాను ఆ సంస్థతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.ఈ ప్రయత్నాలు ఫలిస్తే తమ ప్రయాణికులకు కాస్త తక్కువ ధరకే ఆధునిక వసతిని కల్పించవచ్చన్నది ఆర్టీసీ ఉద్దేశ్యం.

Published in: on October 20, 2011 at 10:28 am  Leave a Comment  
Tags: ,

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/10/20/%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80%e0%b0%b8%e0%b1%80-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b6%e0%b1%80%e0%b0%98%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b6%e0%b0%a8/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: