దర్శన టిక్కెట్లపై భక్తుల చిత్రాలు

దర్శన టిక్కెట్లపై భక్తుల చిత్రాలు
అక్రమాల అడ్డుకట్టకు తితిదే చర్యలు
తోమల , అర్చన టిక్కెట్ల నుంచి శ్రీకారం
మఠాల గదుల్లో 30 శాతం భక్తులకు
తిరుమల , అక్టోబర్ 19 :

తితిదే మంగళవారం రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. దర్శన టిక్కెట్ల మంజూరులో అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు , మఠాలు , సత్రాల్లోని 30 శాతం గదులను స్వాధీనం చేసుకుని భక్తులకు కేటాయించాలని నిర్ణయించింది. టిక్కెట్ల మంజూరులో అక్రమాలను నివారించే ప్రక్రియలో భాగంగా ఎల్రక్టానిక్‌ లాటరీ విధానం కింద కేటాయిస్తున్న తోమాల , అర్చన టిక్కెట్లపై భక్తుల చిత్రాలను ముద్రించి కేటాయించింది.

దీనివల్ల ఎలాంటి అక్రమాలు జరిగినా సులభంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియకు తితిదే జేఈవో కె.ఎస్‌ శ్రీనివాసరాజు శ్రీకారం చుట్టారు. కేంద్రీయ విచారణ కార్యాలయ ప్రాంగణంలోని ఆర్జితం కేంద్రంనుంచి ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద కేటాయించే టిక్కెట్లపై భక్తుల చిత్రాలను ముద్రించి అందించారు. ఈ విధానాన్ని మరో నాలుగు రోజుల్లో కరెంట్‌ బుకింగ్‌ కోటాకింద విక్రయించే సేవాటిక్కెట్లకు విస్తరిస్తారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న ఈ-దర్శన్‌ కేంద్రాల్లో కూడా చిత్రాలను ముద్రించి అందిస్తారు.

ఈ ఏడాది ఆఖరు నాటికి అన్ని రకాల దర్శన టిక్కెట్లు , అద్దె గదుల రసీదులపై కూడా ఫోటోలు ముద్రించి అందిస్తారు. విచక్షణ కోటాలోనూ ఈ విధానాన్ని అమలు చేసే విషయమై ప్రయత్నాలు జరుగుతున్నాయి. భక్తుల చిత్రాలు ఏవిధంగా సేకరించాలనే విషయమై అధ్యయనం చేస్తున్నారు. కాలినడకన వచ్చే భక్తులను ఉచితంగా అందిస్తున్న దివ్యదర్శనం టోకన్లపై కూడా ఫోటోలు కనిపిస్తాయి. కొత్తగా ప్రవేశపెట్టిన విధానంద్వారా టిక్కెట్ల మార్పిడికి , అక్రమాలకు అవకాశం ఉండదు. టిక్కెట్ల స్కానింగ్‌ కోసం పడుతున్న సమయం ఆదా అవుతుంది.

Advertisements

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/10/20/%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b6%e0%b0%a8-%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%ad%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: