వైభవంగా పున్నమి గరుడసేవ

వైభవంగా పున్నమి గరుడసేవ
తిరుమల , అక్టోబర్ 12 :

శ్రీవారి పున్నమి గరుడసేవ మంగళవారం వైభవంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో రద్దీ వల్ల గరుడవాహనసేవను దర్శించుకోలేని భక్తులకోసం ప్రతిపౌర్ణమి సందర్భంగా గరుడవాహన సేవను టిటిడి నిర్వహిస్తోంది. ఈ మేరకు మంగళవారం రాత్రి 7 నుంచి 8 గంటలవరకు వాహనసేవ కన్నులపండువలా సాగింది. సాయంత్రం వైభవోత్సవ మండపంలో సహస్రదీపాలంకరణ సేవ ముగించుకున్న శ్రీవారు వాహన మండపంలో వేంచేపు చేశారు. బంగారు వజ్ర, వైఢూర్య మరకత మాణిక్యాదుల ఆభరణాలు , పుష్పమాలలతో స్వామివారిని అలంకరించారు. మంగళవాయిద్యాలు , వేదమంత్రోచ్ఛారణ , భక్తుల గోవిందనామస్మరణలమధ్య స్వామివారి ఉత్సవ ఊరేగింపు ప్రారంభమైంది. ఉత్సమూర్తి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

వైభవోత్సవ మండపంలో సహస్ర దీపాలంకరణ సేవ

తిరుమల వైభవోత్సవ మండపంలో మంగళవారం శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. సాధారణంగా సాయంత్రం 5 గంటలకు ఆలయం పక్కనే ఉన్న మండపంలో సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించే వారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా వర్షం కురిసింది. ఈ నేఫథ్యంలో సహస్ర దీపాలంకరణ సేవను వైభవోత్సవ మండపానికి మార్పుచేశారు. వర్షం వచ్చిన సందర్భంలో ప్రత్యామ్నాయంగా వేయి నేతి దీపాలు వెలిగించేందుకు ప్రత్యేకగంఆ ఏర్పాటు చేశారు. నేతి దీపాల వెలుగులో శ్రీదేవి , భూదేవి సమేత స్వామివారు ఊయలపై ఊగుతూ భక్తులను కనువిందు చేశారు.

Advertisements
Published in: on October 19, 2011 at 8:55 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/10/19/%e0%b0%b5%e0%b1%86%e0%b1%96%e0%b0%ad%e0%b0%b5%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%aa%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%97%e0%b0%b0%e0%b1%81%e0%b0%a1%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: