వెంకటాచలం విశేషాలు

వెంకటాచలం విశేషాలు
తిరుమల , అక్టోబర్ 5 :

= నిత్య, వార, పక్ష, మాస, సంవత్సరం… ఇలా ఏడాదికి సుమారు 450 ఉత్సవాల్లో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు మర్రి ఊడల (మర్రి ఊడలతో తయారు చేసిన బలమైన కొయ్య తండ్లు)పై ఊరేగుతున్నారు.
= మర్రి ఊడలతో తయారు చేసిన కొయ్య తండ్లు 40, 50 ఏళ్లు బలంగా ఉంటాయి. టీటీడీ అధికారులు నల్లమల అడవుల నుంచి భారీ మర్రి ఊడలు సేకరిస్తారు.
= ఆరు నెలల పాటు నీటిలో నానబెడతారు. మరో ఆరు నెలలు ఎండ తగలని నీడలో ఆర బెడుతారు.
= చెదలు పట్టకుండా, బలంగా ఉండేం దుకు పచ్చకర్పూరం, పసుపు, ఇతర లేహ్యాలతో మర్దనం చేస్తారు.
= వాహనం మోసేందుకు 35 అడుగుల పొడవున్న రెండు తండ్లు, 20 అడుగులు ఉన్న రెండు తండ్లు, అడ్డ పలకలు, మోకులు, తాళ్లు వినియోగిస్తారు. తర్వాత పీఠంపై వాహనం ఏర్పాటు చేస్తారు. వీటిపై ఉత్సవర్లను ఊరేగింపునకు సిద్ధం చేస్తారు.
= టీటీడీ వద్ద తండ్లు రెండు మూడు సెట్లు సిద్ధంగా ఉంటాయి. వాహన సేవలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా తండ్లు సిద్ధం చేస్తారు.
= ఉత్సవర్లకు ఎండ తగలకుండా తండ్లపై రెండు ఛత్రాలు(గొడుగులు) అమరుస్తా రు. వాహన సేవ బరువు రెండు మూడు టన్నులుంటుంది.
= 52 మంది వాహన బేరర్లు (మోసే ఉద్యోగులు) భుజాలపై వేసుకుని నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తూ దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తారు.
= వాహన బేరర్ల కష్టాన్ని గుర్తించిన టీటీడీ జీతానికి అదనంగా రిస్క్ అలెవెన్స్‌ను రూ.300 నుంచి రూ.1000కు పెంచింది.
= బరువుతో సంబంధం లేకుండా భక్తితో ఒకే పట్టులో లయబద్దంగా వాహనాలు మోయడంలో బేరర్లు సిద్ధ హస్తులు.

Tags: ముఖ్యమైన వార్తలు,
Published in: on October 5, 2011 at 12:36 pm  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/10/05/%e0%b0%b5%e0%b1%86%e0%b0%82%e0%b0%95%e0%b0%9f%e0%b0%be%e0%b0%9a%e0%b0%b2%e0%b0%82-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%87%e0%b0%b7%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: