ధ్వజపటం రూపుదాల్చేదిలా…

ధ్వజపటం రూపుదాల్చేదిలా…
తిరుపతి , సెప్టెంబర్ 30 :

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలి ఘట్టం ధ్వజారోహణం. గరుడుడి రూపాన్ని చిత్రీకరించిన పతాకాన్ని (ధ్వజ పటం) ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. బ్రహ్మోత్సవాలు ముగిశాక ధ్వజపటాన్ని కిందకు దించుతారు. దీన్నే ధ్వజావరోహణం అంటారు. బ్రహ్మోత్సవాలకు దేవతలకు ఆహ్వానం పలికేది ధ్వజ స్తంభంపైన ఉండే ధ్వజపటమే. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ధ్వజటాన్ని రూపకల్పన చేస్తున్న చిత్రకారుడు ఎవరోకాదు…పే రూరు శివప్రసాద్. 25 ఏళ్లుగా ఆయనే అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ పని చేస్తున్నారు. శివప్రసాద్ టీటీడీ సప్తగిరి మాసపత్రికలో చిత్రకారునిగా పని చేస్తున్నారు.

ధ్వజపటం రూపకల్పన ఇలా…

ఏడు అడుగుల నూతన శ్వేత (తెల్లటి) వస్త్రాన్ని తీసుకుని ఒకరోజు పూర్తిగా స్వచ్ఛమైన పసుపు నీళ్లలో నానబెడుతారు. బాగా ఆరిన తర్వాత నిమ్మఉప్పులో నానబెడతారు. దీని వల్ల పసుపు వర్ణం వెలిసిపోకుండా ఉంటుంది. అలా రూపొందిన పసుపు వస్త్రంపై అత్యంత భక్తి ప్రపత్తులతో గరుడ చిత్రాన్ని (గరుడాళ్వార్ అని కూడా అంటారు) సహజ వర్ణాలతో గీస్తారు. సహజ వర్ణాలు అంటే…ఎర్రమట్టిని చెట్టు జిగురుతో మిశ్రమం చేసి దానికి బొగ్గు పొడిని (కావాల్సినంత) కలుపుతారు. ఇలా తయారైన సహజ వర్ణంతో పసుపు వస్త్రంపై గరుడ చిత్రాన్ని చిత్రీకరిస్తారు.

గరుడ చిత్రం నమూనాలో…
కుడిచేతి భంగిమ ద్వారా…శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు మీరంతా రండంటూ సర్వ లోకాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు, ఎడమ చేతి భంగిమ ద్వారా…పూర్ణ కలశాన్ని సూర్య, చంద్రుల సాక్షిగా చూపుతూ, పంచ భూతాలకు ప్రతీక అయిన 5 కలశాలను, హారతి, గంట, ధూపములను చిత్రంలో చిత్రీకరిస్తారు. గరుడుడికి ఆభరణాలుగా సర్పజాతిని చిత్రీకరిస్తారు. అలా పూర్తి స్థాయిలో రూపొందిన ధ్వజ పటాన్ని ఉత్సవాలకు వారం రోజుల ముందుగా టీటీడీ ఉన్నతాధికారులకు అందజేస్తారు. ఈ ధ్వజ పటాన్ని ధ్వజారోహణం రోజు తిరుమల నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి ధ్వజస్తంభం వద్దకు తీసుకెళతారు. ఇదిలావుండగా టీటీడీ అనుబంధ సంస్థల వార్షికోత్సవాల లోగోలనూ శివప్రసాద్ రూపొందించారు. ఇందుకుగాను అనేక నగదు బహుమతులు, జ్ఞాపికలు అందుకున్నారు. ఆయన స్వగ్రామం వైఎస్‌ఆర్ జిల్లా రాజంపేట సమీపంలోని మన్నూరు.

Published in: on September 30, 2011 at 10:07 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/09/30/%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b5%e0%b0%9c%e0%b0%aa%e0%b0%9f%e0%b0%82-%e0%b0%b0%e0%b1%82%e0%b0%aa%e0%b1%81%e0%b0%a6%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%9a%e0%b1%87%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b2%e0%b0%be/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: