పాతికేళ్లుగా .. అన్నదానం

పాతికేళ్లుగా .. అన్నదానం
కొనసాగుతున్న నిత్యాన్నదాన పథకం
రేపు రాష్ట్రపతి ప్రారంభించనున్న నూతన భవన సముదాయం
తిరుమల , జులై 6 :
సుదూర ప్రాంతాల నుంచి స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించాలన్న లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1985 ఏప్రిల్‌ 6న నిత్యాన్నదాన పథకం ప్రారంభించింది. అప్పటి నుంచి ఎటువంటి అంతరాయం లేకుండా ఈ కార్యక్రమాన్ని తితిదే ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తోంది. అప్పట్లో రెండువేల మంది భక్తులతో అన్నదానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు రోజుకు సుమారు 70 వేల మంది భక్తులకు ఉచిత భోజనం సౌకర్యం కల్పిస్తున్నారు. సుమారు 12 గంటల పాటు నిరంతరాయంగా అన్నదానం చేస్తోన్నారు. ఇక్కడి భోజనాన్ని సాక్షాత్తు శ్రీవారి ప్రసాదంగా భక్తులు భావిస్తారు. ఎల్వీ రామయ్య అనే భక్తుడు తొలిసారిగా ఇచ్చిన రూ.పది లక్షల విరాళంతో అన్నదానం ట్రస్టు ప్రారంభించారు. నేడు ట్రస్టు డిపాజిట్లు రూ.275 కోట్లకు చేరుకున్నాయి. వీటిపై వచ్చే వడ్డీతో అన్నదానం చేస్తున్నారు. పెరిగిన భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని నూతన అన్నదాన భవనాన్ని రూ.32 కోట్ల వ్యయంతో రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. దీనికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన భవనంగా పేరుపెట్టారు. ఈ భవన సముదాయాన్ని గురువారం రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ ప్రారంభించనున్నారు.
ఏడుకొండలవాడా..వేంకటరమణా.. నీవే దిక్కు! అతిధి మర్యాదలకు నిధుల కొరత..! చివరి నిమిషంలో తితిదే సర్దుబాటు..! ప్రభుత్వ ఉదాసీనతకు పరాకాష్ట
అతిధులు వస్తున్నారంటే.. సొమ్ముల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఇతరత్రా సర్దుబాటు చేసుకోవడమో.. లేకపోతే వారి మర్యాదల కోసం వడ్డికాసుల వాడిని ఆశ్రయించడమో తప్పడం లేదు. ప్రస్తుతం దేశాధినేత, రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు రాచ మర్యాదలకోసం తితిదేనే సొమ్ములు సమకూరిస్తే గాని గట్టెక్కని పరిస్థితి. ప్రభుత్వ ఉదాసీనతకు ఇది పరాకాష్ట.
ఇంటికి చుట్టాలొస్తున్నారంటే.. పిల్లలకు పండగే. యజమానికి మాత్రం చేయి వాచిపోతుంటుంది. చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు అతిధులొస్తున్నట్లు కబురొస్తే.. సొమ్ముల కోసం మిత్రుల ముందు చేయి చాపాల్సిందే. పాపం ప్రభుత్వ అధికారులకు అదే చిక్కొచ్చి పడుతోంది. శ్రీవారు కొలువై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు నిత్యం ప్రముఖుల తాకిడి ఉంటుంది. ప్రజాప్రతినిధులు మొదలు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులు.. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు ముఖ్యులు పలువురు.. ఇలా ఎవరొకరూ నిత్యం వస్తూనే ఉంటారు. వారందరికి ప్రభుత్వం తరఫున అతిధి మర్యాదలు చూడాలి. ఎవరికి ఏ చిన్న లోటు వచ్చినా.. వారి దురుసు ప్రవర్తనకు స్థానిక అధికారులు బలి కావాల్సిందే. అందుకు అతిధి మర్యాదల కోసం ప్రభుత్వం సొమ్ములు ఇచ్చినా.. ఇవ్వకపోయినా ఏదోలా అన్ని దగ్గర ఉండి సర్దుబాటు చేసుకుని ముందుకు నడిపించేస్తుంటారు బాధ్యతాయుతులైన అధికారులు.
* దేశాధినేత ప్రతిభాపాటిల్‌ రాక సందర్భంగా అధమం రూ.15లక్షలు అవసరమవుతాయని ప్రోటోకాల్‌ అధికారులు అంచనా వేశారు. ప్రోటోకాల్‌ నిర్వహించే అధికారుల వద్ద అంతమేర సొమ్ములు లేవు. * ఇప్పటికే ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోటోకాల్‌ బకాయిలు రూ.కోటి వరకు ఉన్నాయి.
* దాదాపు ఏడాది కావస్తున్నా.. ప్రధాని మన్మోహన్‌ వచ్చిన పర్యటనకు ఖర్చు చేసిన నిధులే ఇంతవరకు మంజూరు కాలేదు.
* చివరికి జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకున్నారు. జిల్లాకు వివిధ పథకాల కింద నిధులు వస్తుంటాయి. వాటిని బ్యాంకుల్లో వేస్తారు. అందుకు కొంత వడ్డి సమకూరుతుంటుంది. ఆ వడ్డీ సొమ్ములు రూ.3లక్షలను జిల్లా అధికారులు సమకూర్చారు.
* మరి మిగిలిన నిధుల మూటను.. రాష్ట్రపతి తిరుమలకు వస్తున్నారు కాబట్టి.. ఏడుకొండలవాడి నెత్తిన పెట్టేశారు.
* దాదాపు వందకుపైగా వాహనాలు వాహనశ్రేణిలో పాల్గొనాల్సి ఉంది. వాటిని రవాణా శాఖ సమకూరుస్తోంది.
* ఎక్కడి వాహనాలను అక్కడ నిలిపేసి.. అడ్డగించి వాటిని రాష్ట్రపతి వాహనశ్రేణిలో పెట్టేందుకు సమకూర్చింది. వాటికి చెల్లించే మొత్తం నిధులను తాము చెల్లిస్తామని తితిదే హామీ ఇచ్చినట్లు తెలిసింది.

చివరికి వడ్డి కాసులవాడు సొమ్ములిస్తే గానీ.. అతిధులకు మర్యాదలు చేయలేదని దుస్థితిలో రాష్ట్ర సర్కారు ఉండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా అందరూ చందాలు వేసుకుని ఎన్నాళ్లు చేయాలని అధికారవర్గాలు లోలోపల మధనపడుతున్నాయి.

Published in: on July 23, 2011 at 2:33 pm  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/07/23/%e0%b0%aa%e0%b0%be%e0%b0%a4%e0%b0%bf%e0%b0%95%e0%b1%87%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b0%be-%e0%b0%85%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%a6%e0%b0%be%e0%b0%a8%e0%b0%82/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: