వైభవంగా సహస్ర దీపాలంకార సేవ

వైభవంగా సహస్ర దీపాలంకార సేవ
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
యలవాటు సేసె నీ ఉయ్యాల
తిరుమల , జులై 10 :
శ్రీవారి సహస్రదీపాలంకార సేవ వైభవంగా శనివారం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి తిరుచ్చి పీఠాన్ని అధిరోహించి ఆలయం వెలుపల ఉన్న కొలువు మండపానికి ఛత్రచామర మంగళ వాద్య సమేతంగా వేంచేశారు. కొలువు మండపంలో 1008 నేతి దీపాల వెలుగుల మధ్య సేవ జరిగింది. తితిదే ఆస్థాన విద్వాంసురాలు, పద్మశ్రీ శోభరాజ్‌ బృందం అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తుండగా ఉభయ దేవేరులతో స్వామివారి తిరుచ్చిని గొలుసులతో వేలాడదీసి ఊపారు. స్వామివారికి పంచ కజ్జాయం నివేదన చేసి నక్షత్ర హారతి ఇచ్చారు. అనంతరం కర్పూర హారతి కూడా ఇచ్చారు. ఆ తర్వాత తిరుమాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి ఊరేగుతూ ఆలయంలోకి ప్రవేశించారు.

Published in: on July 11, 2011 at 6:26 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/07/11/%e0%b0%b5%e0%b1%88%e0%b0%ad%e0%b0%b5%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%b8%e0%b0%b9%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%a6%e0%b1%80%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%82%e0%b0%95%e0%b0%be%e0%b0%b0/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: