గోవింద అభయం * రూ.60లక్షలతో సిద్ధం * కాలినడక భక్తులకు విశ్రాంతి భవనం

గోవింద అభయం

* రూ.60లక్షలతో సిద్ధం

* కాలినడక భక్తులకు విశ్రాంతి భవనం

తిరుపతి , జులై 5

తిరుమలకు కాలినడకన తరలివచ్చే వందలాది భక్తుల సౌకార్యర్థం తితిదే విశ్రాంతి భవనం సిద్ధం చేసింది. రవాణా సౌకర్యాలు అనుకూలంగా ఉన్నా, చాలామంది భక్తులు సంప్రదాయ పద్ధతిలో కాలినడకన తిరుమల చేరడం ఆనవాయితీగా వస్తోంది. చిత్తూరు జిల్లా సరిహద్దు గ్రామాలు… తమిళనాడులోని భక్తులుకాలినడకన తరలిరావడం పరిపాటి. తిరుమలకు చేరే మార్గంలో విశ్రాంతి భవనాలు, వంటశాల, స్నానాల గదులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

శ్రీకృష్ణదేవరాయల కాలంలో..

చరిత్రను పరికిస్తే శ్రీకృష్ణదేవరాయుల కాలంలో కాలినడక భక్తుల కోసం రహదారుల వెంట మండపాలు నిర్మించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. కాంచీపురం, తిరువళ్లూరు నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు తిరుత్తణి సమీపంలో ఒక మండపం ఉంది. అలాగే నగరిలో ఒక సత్రం, మండపం.. రామాపురం వద్ద మరొకటి.. వడమాలపేట వద్ద చిన్న సత్రం ఉండేవి. కాలగర్బంలో ఇవి శిథిలావస్థకు చేరి కనుమరుగయ్యాయి. ఒక్క నగరిలో మాత్రమే కొండ చుట్టూ ఉన్న మండపం నేటికీ భక్తులకు విశ్రాంతి నిలయంగా ఉంది. పలుమార్లు కాలినడక భక్తులు తితిదే అధికారులకు తమ కష్టాలను విన్నవించేవారు. ఎట్టకేలకు వారి ఆవేదన గుర్తించిన తితిదే నగరి సమీపంలో రామాపురంమలుపు వద్ద సుమారు రూ.60లక్షలతో నూతన విశ్రాంతి భవనం, వంటశాల, స్నానాల గదులు నిర్మించింది. ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తిచేసుకొని ప్రారంభానికి సిద్ధమవుతోంది. వేలమంది గోవింద భక్తులకు అభయంగా మారనుంది.

వైద్య సేవలందిస్తే…

ఇదే తరహాలో కాలినడక భక్తులకు మార్గమధ్యలో వైద్యసేవలు అందించడానికి సంచార ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్నది భక్తుల అభ్యర్థన. ఈ ప్రతిపాదనకు తితిదే అనుకూలంగా స్పందిస్తే కాలినడకన వచ్చే సంప్రదాయ భక్తుల కష్టాలు తీరినట్లే.

Published in: on July 5, 2011 at 9:04 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/07/05/%e0%b0%97%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6-%e0%b0%85%e0%b0%ad%e0%b0%af%e0%b0%82-%e0%b0%b0%e0%b1%82-60%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%b8%e0%b0%bf/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: