నేత్రపర్వంగా గరుడోత్సవం

నేత్రపర్వంగా గరుడోత్సవం
* ఆనందపరవశులైన భక్తులు
తిరుపతి , జూన్ 17 :
అప్పలాయిగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి గరుడోత్సవం గురువారం వైభవంగా జరిగింది. మెడలో లక్ష్మీసహస్రహారం.. వక్షస్థలంలో పచ్చను ధరించి దివ్యాలంకార భూషితుడైన స్వామి తన వాహనం గరుత్మతుండిపై ఆసీనులై భక్తజనానికి దివ్యవ దర్శనం ఇచ్చారు. స్వామివారిని చూచిన భక్తులు తన్మయత్వంతో గోవింద నామస్మరణలు చేస్తూ దర్శించుకున్నారు. అంతకుముందు రామబంటు హనుమంతుడిని వాహనం చేసుకొని ప్రసన్న వెంకన్న పుర వీధుల్లో విహరించారు. ఉదయం స్వామికి నిత్యకైంకర్యాలనంతరం మూలవర్లకు విశేషపూజలు చేశారు. గ్రామవీధుల్లో సుదర్శన చక్రాన్ని వూరేగింపుగా తీసుకొచ్చి స్వామి విహారానికి ఏర్పాటు చేశారు. వాహనసేవ తదుపరి స్వామి ఆలయ మండపానికి చేరుకున్నారు. అక్కడ శ్రీదేవి, భూదేవిలతో కలసి స్వామికి స్నపన తిరుమంజన సేవ జరిపారు.
కోలాహలం.. వసంతోత్సవం
సాయంత్రం గ్రామంలో నిర్వహించిన వసంతోత్సవం కోలాహలంగా జరిగింది. దవళవస్త్రాలతో విశేషంగా అలంకృతులైన శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్నవెంకన్న తిరుచ్చి వాహనంలో ఆశీనులయ్యారు. గంధం, కుంకుమ, పన్నీరు కలిపిన మిశ్రమాన్ని అర్చకులు, పరిచారకులు భక్తులపై చల్లుతూ వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం దేవేంద్రుని వాహనం ఐరావతంపై మత్స్యావతారుడైన ప్రసన్న వెంకన్న విహరించారు. సూపరింటెండెంట్‌ పీతాంబరరాజు, ఆలయాధికారి శ్రీనివాసులు, అర్చకులు రమణాచార్యులు, తిప్పాయ్యాచార్యులు, రమేషాచార్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.

నేడు సూర్య, చంద్రప్రభలపై..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై వూరేగనున్నారు. సాయంత్రం 7.30 గంటలకు వూంజల్‌సేవ జరుగుతుంది.

Advertisements
Published in: on June 18, 2011 at 4:57 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/06/18/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%97%e0%b0%b0%e0%b1%81%e0%b0%a1%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b5%e0%b0%82/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: