శ్రీవారి పునఃదర్శనం రేపు ఉదయమే

శ్రీవారి పునఃదర్శనం రేపు ఉదయమే
నేటి సాయంత్రం నుంచి ఆలయం మూసివేత
తిరుమల , జూన్ 15 :
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ధర్మ దర్శనం గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ఆలయ మహాద్వారాన్ని మూసివేయనున్నారు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు మళ్లీ తెరుస్తారు. వెంటనే ఏకాంతంగా సుప్రభాత సేవ నిర్వహిస్తారు. అనంతరం వరుసగా తోమాల, అర్చన సేవలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవను రద్దు చేశారు. నిత్యాన్నదానం, తలనీలాలు తీసే కల్యాణకట్టను బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 4 గంటల వరకు మూసివేస్తారు.

బుధవారం మహా లఘుదర్శనం అమలు చేయాలని నిర్ణయించారు. సాయంత్రం 4 గంటలకు దర్శనాన్ని నిలిపివేసి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలలోపే ఏకాంతసేవ నిర్వహించి అన్ని ద్వారాలు మూసుకుంటూ అర్చకులు ఆలయం వెలుపలికి వస్తారు. బుధవారం అర్ధరాత్రి 11.53 నుంచి తెల్లవారుజామున 3.32 గంటల మధ్య గ్రహణ ఘడియలు ఉంటాయని తితిదే పేర్కొంది. గురువారం ఉదయం 7 గంటలకు వైకుంఠం-2లోకి భక్తులను అనుమతిస్తారు.

Published in: on June 16, 2011 at 5:00 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/06/16/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%81%e0%b0%a8%e0%b0%83%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b6%e0%b0%a8%e0%b0%82-%e0%b0%b0%e0%b1%87%e0%b0%aa%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: