మోహిని అవతారంలో ప్రసన్న వెంకన్న

మోహిని అవతారంలో ప్రసన్న వెంకన్న
తిరుపతి , జూన్ 16 :
అప్పలాయిగుంట ప్రసన్న వెంకన్న బ్రహ్మోత్సావాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో పల్లకీపై ఊరేగారు. కనులపండువగా జరిగిన ఈ కార్యక్రమానికి భక్తజనులు పెద్దఎత్తున హాజరై లోకరక్షకుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యపూజలు జరిపించారు. రాక్షసులను సంహరించేందుకు శ్రీమహావిష్ణువు మోహిని అవతారమెత్తి అమృతాన్ని దేవతలకు పంచి లోకాన్ని రక్షించిన ఇతిహాసానికి గుర్తుగా శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
స్నపన తిరుమంజనం
అర్చకులు వేదమంత్రాలతో ఆలయ ఆవరణలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకన్నకు ఆలయ ఆవరణలో ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, నారికేళ జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి విశేషంగా అలంకరించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ పీతాంబరరాజు, ఆలయాధికారి శ్రీనివాసులు, అర్చకులు రమణాచార్యులు, తిప్పాయాచార్యులు, రమేషాచార్యులు పాల్గొన్నారు.
నేడు గరుడ, హనుమంత, గజవాహనం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం ఉదయం గరుడ, హనుమంత, రాత్రి గజవాహనంపై ఊరేగనున్నారు. సాయంత్రం వసంతోత్సవం జరుగనుంది.

Published in: on June 16, 2011 at 10:50 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/06/16/%e0%b0%ae%e0%b1%8b%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%85%e0%b0%b5%e0%b0%a4%e0%b0%be%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: