మురిపించిన ముత్యపు కవచం అలంకరణ

మురిపించిన ముత్యపు కవచం అలంకరణ

తిరుమల , జూన్ 15 :
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి జ్యేష్ఠాభిషేకం మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం ముత్యపు కవచం అలంకరణతో శ్రీమలయప్పస్వామి భక్తులను మురిపించారు. ఉదయం 9 గంటలకు సంపంగి ప్రాకారంలోని కల్యాణ మండపంలో అభిధేయక అభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. యాగశాలలో వంద కలశాలను రుత్విక్కులు ఏర్పాటు చేసి పూజా నివేదనలు చేశారు. ఉత్సవమూర్తులకు కంకణధారణ, హోమతిలకం దిద్దారు. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ముత్యపు కవచం అలంకరణతో శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో సాయంత్రం వైభవంగా ఊరేగారు. ఈ మహోత్సవంలో తితిదే జేఈవో యువరాజు, సీవీఎస్‌వో ఎం.కె.సింగ్‌, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మునిరత్నంరెడ్డి, పేష్కారు చంద్రశేఖర పిళ్త్లె, ఓఎస్డీ డాలరు శేషాద్రి, బొక్కసం ఇన్‌ఛార్జి గురురాజా పాల్గొన్నారు.

వకుళాదేవికి స్వర్ణకవచం : కొత్తగా చేయించిన తితిదే
శ్రీవారి ఆలయంలోని వకుళాదేవికి తిరుమల, తిరుపతి దేవస్థానం స్వర్ణకవచాన్ని తయారు చేయించింది. మంగళవారం దీనిని అమ్మవారికి అలంకరించారు. కలియుగంలో శ్రీనివాసుని తల్లిగా అవతరించిన వకుళాదేవి విగ్రహం ఆనంద నిలయానికి వాయవ్యదిశగా నిర్మించిన వంటశాలలో ఉంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు వంటశాల వైపుగా వెళ్లి వకుళామాతకు నమస్కరించుకున్న అనంతరం అంకురార్పణ మండపం వద్ద తీర్థం, శఠారి అందుకునే ఆనవాయితీ కొనసాగుతోంది. స్వామికి ప్రియమైన వివిధ రకాల వంటకాలను తయారుచేసే వంటశాలను పర్యవేక్షిస్తూ తూర్పునకు అభిముఖంగా అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించి ఉంది.

Published in: on June 16, 2011 at 5:20 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/06/16/%e0%b0%ae%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf%e0%b0%aa%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ae%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%aa%e0%b1%81-%e0%b0%95%e0%b0%b5%e0%b0%9a%e0%b0%82/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: