కల్పవృక్షంపై ప్రసన్న వెంకన్న

కల్పవృక్షంపై ప్రసన్న వెంకన్న
* బారులు తీరిన భక్తులు
తిరుపతి , జూన్ 15 :
అప్పలాయిగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామి చిరునగవులు చిందిస్తూ కల్పవృక్ష వాహనంపై ఊరేగారు. సుప్రభాత సేవతో మేల్కొన్న స్వామికి అర్చకులు నిత్యపూజలను చేసిన అనంతరం మరకత మాణిక్యాలు, పట్టుపీతాంబరాలు, పూలమాలలతో అలంకరించి కల్పవృక్ష వాహనంపై ఉంచి భజన బృందాలు, మేళతాళాలు,నృత్యాల నడుమ స్వామిని వీధుల్లో ఊరేగించారు. తర్వాత స్వామివారుసర్వభూపాల వాహనంపై విహరించారు.

కమనీయం కల్యాణోత్సవం
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్నవేంకన్న కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీహరి కల్యాణోత్సవానికి అష్టదిక్పాలకులు, సకల దేవతలు, వైష్ణవ గణాలను మంత్రయుక్తంగా ఆవాహన గావించారు. అనంతరం వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా వేదపండితులు వరుడైన స్వామికి, వధువులైన శ్రీదేవి, భూదేవిలకు కల్యాణం జరిపించారు. ఇంతలో జోరుగా వాన కురవడం.. భక్తులకు ప్రత్యేక షెల్టర్లు లేకపోవడంతో నానా అవస్థలు పడ్డారు. చివరికి స్వామివారి కల్యాణం అర్ధంతరంగా ముగిసింది. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ పీతాంబరరాజు, ఆలయాధికారి శ్రీనివాసులు, అర్చకులు రమేషాచార్యులు, తిప్పాచార్యులు, రమణాచార్యులు పాల్గొన్నారు.

నేడు పల్లకీలో..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రసన్న వేంకన్న బుధవారం ఉదయం పల్లకీలో ఊరేగనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా రాత్రి ఏడు గంటలకు ఆలయాన్ని మూసేస్తారు. గ్రహణం కారణంగా గరుడవాహనంపై స్వామివారు గురువారం ఉదయం ఊరేగుతారు.

Published in: on June 16, 2011 at 4:54 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/06/16/%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%aa%e0%b0%b5%e0%b1%83%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%82%e0%b0%aa%e0%b1%88-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b5%e0%b1%86%e0%b0%82/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: