ముత్యపుపందిరిపై దేవోత్తముడు

ముత్యపుపందిరిపై దేవోత్తముడు
పోటెత్తిన భక్తజనం
తిరుపతి , జూన్ 14 :
ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ముత్యపుపందిరి వాహన సేవసమ్మోహనభరితంగా సాగింది. అర్చకుల మంత్రోచ్ఛారణ, అశేషభక్తజన సందోహం నడుమ స్వామివారు వాహనమండపానికి చేరుకున్నారు. కాళీయమర్ధనుడి భంగిమలో ముత్యపు పందిరి వాహనంలో సతులతో ఆశీనుడైన స్వామిని చూడటానికి భక్తులు పోటెత్తారు. విశేషాభరణాలతో సర్వాలంకార శోభితుడైన ఉత్సవర్లు గ్రామవీధుల్లో ఊరేగారు. అంతకుముందు ఉదయం సుప్రభాతం, అర్చన, నిత్యకైంకర్యాలు పూర్తయ్యాక వీధుల్లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను చక్రతాళ్వార్‌ పర్యవేక్షించారు. అనంతరం స్వామి వాహన మండపానికి చేరుకుని సింహవాహనాన్ని అధిష్టించారు. యోగనరసింహస్వామి అలంకరణలో గ్రామ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించి ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ పీతాంబరరాజు, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాసులు, అర్చకులు రమణాచార్యులు, తిప్పాచార్యులు, రమేషాచార్యులుపాల్గొన్నారు.
కనులపండువగా స్నపన తిరుమంజనం
ఆలయంలో స్నపన తిరుమంజనం కనులపండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్నవెంకన్నకు ఆలయ ఆవరణలో ఉదయం అర్చకులుస్నపన తిరుమంజనం చేపట్టారు. బ్రహ్మోత్సవ వేళల్లో ఉత్సవమూర్తుల శుద్ధికి నిర్వహించే ఈ అభ్యంగన స్నానం భక్తులను ఆనందపరవశుల్నిచేసింది. పంచతీర్థాలతో అభిషేకించాక చందనచర్చతో స్వామివారి మూర్తులకు విశేష అలంకరణ చేశారు.

నేడు కల్పవృక్షంపై..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మంగళవారం ఉదయం కల్పవృక్షవాహనం.. రాత్రి సర్వభూపాల వాహనాలపై ఊరేగనున్నారు. సాయంత్రం 5.30-7.30 గంటల మధ్య కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులందరూ హాజరై స్వామివారి కృపకు పాత్రులుకావాలని వారు కోరారు.

Published in: on June 14, 2011 at 10:28 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/06/14/%e0%b0%ae%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%aa%e0%b1%81%e0%b0%aa%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%aa%e0%b1%88-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: