గోవిందరాజస్వామి ఆలయ వైభవం తెలుసుకుందామా !

గోవిందరాజస్వామి ఆలయ వైభవం తెలుసుకుందామా !
అపురూప శిల్పసంపదకు నిలయం ఆ ఆలయం
నిత్య కైంకర్యాలకు నాటి యాదవ రాజు దాన దృష్టే ఆదర్శం
గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేకం
తిరుపతి , జూన్ 14 :
యాదవ రాజుల నరసింహయాదవరాయల సహకరాంతో శ్రీదేవి , భూదేవి సహిత గోవిందరాజస్వామి వారిని పార్థసారథి దేవాలయ ఉత్తర భాగంలో ప్రతిష్టించారు. గోవిందరాజస్వామి శయనమూర్తి ఆవిర్భావం జరిగింది. నాభి నుంచి ఉద్భవించిన పద్మంపై చతుర్మఖ బ్రహ్మ , తూర్పు వైపున లక్ష్మీదేవి , ఉత్తర భాగంలో దక్ష్మిణాభిముఖంగా భూదేవి కొలువుదీరి దర్శనమిస్తారు. స్వామివారి పాదాలచెంత మధకైటభులనే రాక్షసుల విగ్రహాలు ఉన్నా వీక్షకులకు వీరి వివరాలు తెలియవు. గర్భగృహ ద్వారం ముందు ద్వార పాలకులను దాటి ముందుకు వస్తే వసంత మండపం , నీరాళి మండపం , చిత్రకూట మండపం , ముఖ హారతి మండపం , లక్ష్మీదేవి మండపాలు దర్శనమిస్తాయి. ఈ కట్టడాలు పల్లవ , యాదవ రాయల , చోళ , సంగమ , సాళువ , తుళు , ఆరవీటి వంశాల శిల్పీకరణకు తార్కాణాలుగా మనకు దృగ్గోచరమౌతాయి.

యాదవ పాలనలో వసంత , మాస , బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
దేవాలయ వ్యవస్థ పదిలంగా వుండేలా పదికాలాల పాటు ధూప , ధీప నైవేద్యాలకు , పక్షమాస , వార్షిక బ్రహ్మోత్సవాలకు లోటు లేకుండా యాదవ రాజులు అనేక భూరి దానాలను చేశారు. దేవాలయ వ్యవస్థ నిరాటంకంగా నడిచి , నాటి బ్రాహ్మణ వంశాలు నేటికి కూడా సాంప్రదాయబద్ధులై నిలవడానికి ఈ విధానాలే ప్రధాన కారణంగా నిలుస్తాయి. ఇమ్మడి నరసింగ యాదవ రాయలు దేవాలయ సన్నిధివీధుల్లో బ్రాహ్మణులకు నివాస గృహాలను ఏర్పరచి , భూరి విరాళాలను సమర్పించారు.

తదుపరి పాలించిన వీర నరసింగ యాదవరాయల రాణి నాచియార్‌ తమ వివాహ సమయంలో పుట్టింటి ఆస్తిగా సంక్రమించిన పైడిపల్లెలోని 32 ఆవులను నిత్య నైవేద్యాలకు సమర్పించింది. పైడి ఆనగా పసిడిపంటలకు నిలయమని అర్థం. అటువంటి పాడి పంటలతో విలసిల్లే గ్రామ ప్రధాన ఆదాయంలో సగభాగం , గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఖర్చు చేసేలా దానం చేశారు. గోవిందారాజస్వామివారి రథోత్సవం ఘనంగా జరిగేలా శ్రేష్టమైన కొయ్యలతో రథాన్ని సమర్పించారు. శానంబట్ల పక్క వున్న పైడిపల్లె గ్రామ ఆదాయం నుండి సింహభాగం ఆ రథ మరమ్మతులకు , బంగారు కలశానికి భక్తితో సమర్పించారు.ఈ బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక నిధిని సైతం సమకూర్చారు. దానం చేసేటపుడు దూరదృష్టి కొరవడకుండా దానం చేయాలనే ఆర్యోక్తికి ఈ దాన విధానం ఆదర్శం.

మూడు రాజ గోపురాలు , మూడు రాజ వంశాలు

గోవిందరాజస్వామి వారి దేవాలయ ప్రాంగణంలోని మొదటి రాజగోపురం 8 అంతస్తులతో సుదూరతీరాలకు కనువిందు చేస్తూ తిరుపతి పట్టణ వైభవాన్ని చాటుతుంది. ఈ రాజగోపురాన్ని మట్లి అనంతరాయలు అత్యంత వ్యయప్రయాసకోర్చి నిర్మించారు. 1628 వ సంవత్సరంలో నిర్మించిన ఈ కట్టడంపై కాకతీయ , హళిబేడు , బేలూరు , హంపి శిల్పుల శైలి కనబడుతుంది. అధిష్టానం పైనున్న గోడలపైన , ఉత్తర పార్శంలో మహావిష్ణువును ఆరాధిస్తున్నట్లు మట్లి ప్రభువు , తన దేవేరితో ప్రతిమలను శిల్పీకరించారు.

దక్షిణభాగం గోడలపై మట్లి అనంతరాయలు తండ్రి , ఆయన దేవేరుల ప్రతిమలు శిల్పీకరించటం మనకు మిగిలిన చారిత్రక ఆధారం. వాటి క్రింద తెలుగు లిపి ప్రాభవం మనకు విశదీకరమౌతుంది. రెండవరాజగోపురం 15 శతాబ్దంలో మూడంతస్తులుగా నిర్మితమైంది. దీని అదిష్టానంపై అనేక దేవతా విగ్రహాలను శిల్పీకరించిన శైలినాటి భావజలానికి , వైష్ణవ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి. మూడవ రాజగోపురం 13 వ శతాబ్దంలో విజయనగర రాజ వంశాలలో తొలి సంగమ వంశస్తులు నిర్మించారు.

నాటి శిల్పులపైనా , రాజరికాలపైన తమిళ భాష ప్రభావం విస్తృతంగా గోచరమౌతుంది. విజయనగర ప్రభువుల రాజముద్రికలైన వరాహం , సూర్య , చంద్రులు , కత్తి , శిల్పీకరించడంతో నాటి రాజరికాల కాల నిర్ణయాలకు తార్కాణాలుగా నిలుస్తాయి. ఈ మూడు రాజగోపురాల నిర్మాణంతో తిరుపతి ప్రాంత ప్రాశస్త్యం విస్తృతమై సుదూర తీరాలలోని వైష్ణవ భక్తులను ఆకర్షించి పవిత్ర వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లి అందరికీ ఆరాధనీయ స్థలంగా రూపాంతరం చెందింది.

రాయల నిర్మాణాలు అద్భుతం

గోవిందరాజస్వామివారి గుడి ప్రాంగణంలోని పార్థసారధి , కల్యాణ వెంకటేశ్వర , ఆండాళ్‌ అమ్మవారు , పుండరీక వల్లి(మహాలక్ష్మి) సుదర్శన చక్రత్తాళ్వార్‌ , రామానుజుల వారి సన్నిధి , తిరుమలనంబి విగ్రహాలు వివిధ కాలాలలో నెలకొల్పారు. వీటన్నిటి నిర్మాణశైలి ఒక ఎత్తుగా నడిస్తే , శిలలపై శిల్పాలు చెక్కినారన్న చందంగా శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన కళ్యాణమందిర నిర్మాణశైలి హంపి విరూపాక్ష దేవాలయ శోభను సంతరించుకుంది. సంగీతధ్వనులు వినిపించే చాతుర్యరీతులను ఈ శిలాస్తంభాలపై శిల్పీకరించడం విశేషం. శిలా స్తంభాలపై ఆంధ్రనాట్య రీతులను శిల్పీకరించారు. గోవిందరాజస్వామివారి ఆలయం తిరుపతి ప్రజలకోచారిత్రక వరం. ఈ నిర్మాణశైలిని కాపాడుకోవడం , చరిత్రను స్మరించుకోవడం మన కర్తవ్యం. ముందుతరాల కందించడం మన బాధ్యత.

Advertisements
Published in: on June 14, 2011 at 10:23 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/06/14/%e0%b0%97%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%86%e0%b0%b2%e0%b0%af-%e0%b0%b5%e0%b1%86%e0%b1%96%e0%b0%ad/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: