సూర్య, చంద్రప్రభ వాహనాలపై గోవిందుడు

సూర్య, చంద్రప్రభ వాహనాలపై గోవిందుడు
తిరుపతి , జూన్ 13 :
శ్రీగోవిందరాజస్వామి సూర్య, చంద్రప్రభ వాహనాలపై కొలువుదీరి నగర వీధుల్లో భక్తులను కనువిందు చేశారు. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. వేకువజామున స్వామి వారిని మేల్కొలిపి సుప్రభాత సేవ, అలంకరణ తదితర నిత్య పూజా కైంకర్యాలు, బ్రహ్మోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాల ను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవ మండపంలో సతీసమేత స్వామి వారికి అ భిషేకం నిర్వహించారు. పట్టుపీతాంబర వజ్రవైఢూర్య, వివిధ స్వర్ణాభరణాలతో విశేష అలంకరణ చేశారు. అలంకార భూషితుడైన స్వామి వారిని వాహన మండపానికి తీసుకువచ్చారు. సూర్యప్రభ వాహనంపై సతీసమేతంగా అధిష్టింప చేశారు. అనంతరం మేళతాళాలు, వేదపారాయణం నడుమ స్వామి వారి వాహన సేవ ప్రా రంభమైంది. స్వామి వారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భ క్తుల నీరాజనాలు అందుకున్నారు.
చంద్రప్రభ వాహన సేవ
శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భా గం గా ఆదివారం సాయంత్రం ఉయ్యాల సేవను ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, అన్నమయ్య ప ద సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ గోవిందు ని ఊంజలసేవ వేడుకగా జరిగింది. అంతకు ముందు స్వామి వారికి స్నపన తిరుమంజనం, ప్రత్యేక అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు.

రాత్రి స్వామివారి చంద్రప్రభ వాహన సేవ ఘనం గా జరిగింది. అలంకార భూషితులైన స్వామి వారు ఆ హ్లాదకరమైన వాతావరణంలో గోవిందనామ స్మరణలు, భక్తుల కర్పూర నీరాజనాల నడుమ నగర విహారం చేశారు. ఈ కార్యక్రమంలో లోకల్ టెంపుల్ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో హేమావతి, అర్చక బృం దం పాల్గొన్నారు.

Published in: on June 13, 2011 at 10:05 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/06/13/%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b9%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b0%aa/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: