నాటి రామానుజపురమే నేటి తిరుపతి నగరం !

నాటి రామానుజపురమే నేటి తిరుపతి నగరం !
రూపకర్త ఇమ్మడి నరసింగ యాదవరాయలు
గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేకం
తిరుపతి , జూన్ 13 :
వేయి సంవత్సరాల చారిత్రక సత్యాలను తనలో దాచుకుని కాలగమనంలో ప్రపంచస్థాయి పుణ్యక్ష్రేతంగా భాసిల్లుతున్న ఈనాటి తిరుపతి ఒకనాటి రామానుజపురం వైష్ణవ మందిరంలో దేవుని సన్నిధిలో అందరూ సమానులేనని చాటిన శ్రీ మద్రామానుజ స్వామివారి శిష్యుడైన నాటి చంద్రగిరి పాలకుడు ఇమ్మడి నరసింగ యాదవ రాయుల కృషితో ఏర్పడ్డ ఈ పట్టణం కాలక్రమంలో నగరంగా మారింది. చంద్రగిరి రాజ్యం యాదవ రాజుల పాలనలో వున్నప్పుడు యాదవులు తమ ఇలవేల్పుగా కొలిచే పార్థసారథికి చిన్న దేవాలయం కట్టి పూజలు చేసేవారు. ఆ దేవాలయమే నేడు మనం చూస్తున్న పార్థసారధి దేవాలయం. ఆ తరువాత కాలంలో గోవిందరాజస్వామి ఆలయంగా ప్రసిద్ధి గాంచింది.

చాలామంది యాదవులు తమ పశుసంపదను కాపాడెకుంటూ ఈ ప్రాంతంలో స్థిర నివాసముండేవారు. పశుగ్రాసాల పెంపునకు , పంటలను పండించేందుకు వారికవరసరమైన నీటి వనరులకోసం నాటి నరసింగయాదవ రాయలు 16 నీటి గుంటలను ఏర్పరిచారు. కాలక్రమంలో తదుపరి రాజవంశాల వారు అనేక చెరువులను తవ్వించారు. తాతయ్యగుంట , మల్లయ్యగుంట , బొమ్మగుంట , చిన్నగుంట , తెల్లగుంట , మురికి నీళ్ళగుంట , సింగరి గుంట , సింగాలగుంట , కొరమేనుగుంట తదితర గుంటలన్నీ మంచినీటి సౌకర్యం కోసం రామానుజుడి కాలం నుంచి వదాన్యులు ఏర్పరచినవే.

ఆ తరువాత రాజ్యానికి వచ్చిన సంగమ , సాళువ , తుళు , అరవీటి వంశాల పాలనాకాలంలో తాళ్లపాక చెరువు , రాయలచెరువు ,అవిలాల చెరువు , పేరూరి చెరువు , తుమ్మలగుంటచెరువు ,మంచినీళ్ళ చెరువు కరకంబాడి చెరువు తదితరాలు ఏర్పడ్డాయి.
కులోత్తుంగుని ఆస్థానం నుంచి తిరువేంగడానికి….
వ్రీ.శ 11 వ శతాబ్దాంలో తమిళదేశాన్ని పాలించిన కులోత్తుంగ చోళుని కాలంలో శ్రీవైష్ణ , శైవ మతానుమాయూలమధ్య ఘర్షణలు విపరీతంగా జరిగాయి. శైవ మతాభిమాని అయిన కులోత్తుంగుడు వైష్ణవ మతస్థులను తీవ్రనిర్భందాలకు గురిచేశాడు. వైష్ణవ దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఈ నేపథ్యంలో వైష్ణవ మతాచార్యులైన రామానుజులు తిరుచిత్రకూటంలోని చిదంబరంలో ప్రతిష్టించాల్సిన గోవిందరాజస్వామి విగ్రహాన్ని అప్పటికే ప్రసిద్ధి చెందిన తిరుమల వేంకటేశ్వర స్వామివారి కిందవున్న తిరువేంగడమని పిలిచే ఈ ప్రాంతానికి ఆ విగ్రహాన్ని తరలించే ప్రయత్నం చేపట్టారు.

రామానుజుల వారి శక్తులను భక్తుడైన ఇమ్మడి యాదవ రాయలు ప్రస్తుత పార్థసారథి గుడికి ఉత్తర భాగంలో ఆ గోవిందరాజస్వామివారిని ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేశారు. రామానుజుల నిర్ణయానుసారం ముహూర్త సమయానికి విగ్రహ ప్రతిష్ట జరగాలి. కానీ అనివార్యంగా జరిగిన ప్రమాదాలతో ఆ పవిత్ర విగ్రహం దెబ్బతినడంతో దానిని నేటి నరసింహ తీర్థం వద్ద వదలి వేశారని ప్రతీతి. దానికి ఆధారంగా అక్కడ గోవిందరాజస్వామి వారిని పోలిన విగ్రహం ఇప్పటికీ చూడవచ్చు. అయితే మరో కథనం ప్రకారం తిరుచానూరు మార్గంలో ప్రమాదం జరగడంతో ఆ విగ్రహాన్ని అక్కడే వదిలి వేశారంటారు. వీటికి దృష్టాంతాలుగా సదరు విగ్రహంతో ప్రతిష్టించాల్సిన శ్రీదేవి , భూదేవిలను తిరుచానూరు రోడ్డులోని ప్రస్తుత అంకాళమ్మ దేవాలయం ముందు ప్రతిష్టించి వుండడం గమనించవచ్చు.

గోవిందుని ప్రతిష్ట యధాతథం

ముహూర్త సమయం మించకూడదనే నియమాన్ని పాటించిన రామానుజులు యాదవరాజు ఇమ్మడి నరసింహ యాదవరాయల సాయంతో సున్నపు గారతో గోవిందరాజుల స్వామివారి విగ్రహాన్ని తయారుచేయించి 24-2-1130వ తేదీన ప్రతిష్టించి స్వయంభువుగా ప్రకటించారు. ఇప్పటికీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయత్పూర్వం పఠించే శ్లోకాల ద్వారా మనకు ఈ విషయం తెలుస్తుంది. దీని ఆధారంగా చూస్తే సున్నపుగారతో చేసిన విగ్రహం కావడంతో గోవిందరాజస్వామికి స్నానమాచరించటం బదులు శుద్ధి చేస్తారు.

తరువాత రామానుజునిపై భక్తితత్పరతతో ఇమ్మడినరసింగ యాదవరాయలు రామానుజపురం పట్టణానికి శ్రీకారం చుట్టారు. రామానుజులుపై భక్తితో సన్నిధివీధిలోనూ , ఉత్తరమాడ వీధిలోనూ నివాస గృహాలను కట్టి , నాటి పురోహిత వర్గాలకు దానంగా సమర్పించారు. ఉత్తరమాడ వీధిలో యాదవరాజు కట్టిన గృహం నుంచే తిరుమల దేవస్థాన కార్యాకలాపాలను నిర్వహించేలా తీర్చిదిద్దారు. దీంతో తిరుమల కైంకర్యాలన్నీ ఇక్కడ నుంచేనియంత్రించడం , నిర్వహించడం జరిగేవి. ఈ కార్యకలాపాలతో రామానుజపురం ప్రాశస్త్యం పెరుగుతూ పెరుగుతూ వచ్చింది.

అలాగే గోవిందరాజస్వామికి దైవనందిన , పక్ష , మాసోత్సవాలకు , వార్షిక బ్రహ్మోత్సవాల కైంకార్యలకు తిరుమాడవీధులను ఏర్పరచిన ఇమ్మడి నరసింగ యాదవరాయలు అనేక వస్తువాహనాలను సమకూర్చారు. యాదవరాయల దేవేరి నాచియర్‌ కూడా గోవిందరాజస్వామి విహారానికి చెక్కతో చేసిన రథం సమకూర్చి , దానికి బంగారు కళాశాలను అమర్చారు. కైంకర్యాలను సమర్పించారు. కాలక్రమంలో ఎన్నోకట్టడాలు ఏర్పడి తిరుపతి విస్తరించింది.

నాటి ఆ తిరువేంగడమే తరాలుగా సామాన్యు నోటిలోనాని తిరుపతిగా మారిపోయింది. దూరప్రాంతాలవారికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తొలిమజిలీగా రూపాంతరం చెందింది. నాటి యాదవ రాయల కుల గోత్రాలతో వైశాఖ మాసంలోని అనూరాధా నక్షత్రం దినాన ఇమ్మడి నరసింగ యాదవరాయల జన్మదినం జరుగుతుంది. ఆ రోజున ఆయన పేరుతో ఉభయం చేయడం ఇప్పకీ ఆనవాయితీగా అర్చకులు పాటించడం గమనార్హం. తిరుపతి ప్రాభవానికి , ప్రాశస్త్యానికి ఆ వదాన్యులు చేసిన సేవలే తార్కాణం.

Advertisements
Published in: on June 13, 2011 at 10:14 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/06/13/%e0%b0%a8%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%81%e0%b0%9c%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%ae%e0%b1%87-%e0%b0%a8%e0%b1%87%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%a4/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: