SRI RAMA IMAGES

Advertisements
Published in: on April 8, 2011 at 8:34 am  Comments (1)  
Tags: , , , , ,

TIRUMALA TEMPLE IMAGES

Published in: on April 8, 2011 at 5:03 am  Leave a Comment  

వేడుకగా వేదనారాయణుని జయంతి ఉత్సవాలు

వేడుకగా వేదనారాయణుని జయంతి ఉత్సవాలు
భక్తులతో కిటకిటలాడిన ఆలయం
తిరుపతి , ఏప్రిల్ 7 :
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీహరి ప్రథమ అవతారం మత్స్యావతారమూర్తి వేదనారాయణస్వామి జయంతి ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నిత్యకైంకర్యాలనంతరం శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణులకు అర్చకులు పాలు, పెరుగు, తేనె, చందనం, నారికేళజలాలతో అభిషేకించి సహస్త్రధార కలశాభిషేకం చేశారు. పట్టుపీతాంబరాలు, ఆభరణాలతో ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేశారు. ఆలయంలోని రాములవారి మండపంలో ఉన్న పీఠంపై ఉత్సమూర్తులను ఆసీనులను చేసి శాంతి హోమాన్ని నిర్వహించారు. లోకం సుభిక్షంగా ఉండాలంటూ వేదపండితులు మంత్రోచ్ఛారణలతో అష్టదిక్పాలకులను ఆవాహన కావించి యాగం చేశారు.
వేడుకగా వూంజల్‌సేవ
స్వామి వారి జయంతి ఉత్సవమైన మత్స్య జయంతిని పురస్కరించుకుని సాయంత్రం ఉత్సవమూర్తులను విశేష అలంకరణ చేసి తిరుచ్చిపై ఆస్థాన మండపానికి వూరేగింపుగా తీసుకొచ్చారు. మండపంలో సిద్ధంగా ఉన్న వూయలపై ఉత్సమూర్తులను ఆసీనులను చేసి వూంజల్‌సేవ నిర్వహించారు. అనంతరం తిరుచ్చిపై దేవేరులతో ఆసీనుడైన వేదనారాయణుడు తిరుమాడ వీధులలో వూరేగారు. ఉత్సవమూర్తులు భక్తుల కర్పూర నీరాజనాలుఅందుకుంటూ గ్రామంలో విహరించారు. తిరువీధి విహారానంతరం స్వామి నిజాలయానికి చేరి ఏకాంతసేవలో పవళించారు.

Published in: on April 8, 2011 at 4:42 am  Leave a Comment  

నేటి నుంచి పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలు
తిరుపతి , ఏప్రిల్ 7 :
వాల్మీకిపురంలో వెలసి ఉన్న పట్టాభిరామాలయంలో గురువారం సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 8వ తేదీ ధ్వజారోహణం, గజవాహనసేవ, 9న హనుమంత వాహనంపై నగరోత్సవం, 10న సింహవాహన సేవ, 11న శేషవాహనంపై నగరోత్సవం, 12న మోహినీ అవతార ఉత్సవం, 13న శ్రీసీతారాముల కల్యాణోత్సవం, గరుడ వాహన సేవ, 14న రథోత్సవం, ధూళి ఉత్సవం, 15న పార్వేట ఉత్సవం, అశ్వవాహన సేవ, 16వ తేదీన వసంతోత్సవం, హంసవాహన సేవ, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
స్థల పురాణం
ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో సీతారామ, లక్ష్మణ, భరత శతృఘ్న విగ్రహాలు పుట్టలో నుంచి బయల్పడ్డాయని చెబుతారు. సంస్కృతంలో వల్మీకం అంటే పుట్ట అని అర్థం. అందుచేతనే వాయల్పాడు గ్రామాన్ని పూర్వం వాల్మీకిపురం అని పిలిచేవారు. బోయలు ఎక్కువగా ఉండడంతో బోయలపాడు, వావిల (చింత) చెట్లు అధికంగా ఉండడం వల్ల వావిలపేట, వావిల్‌కపహాడ్ అని ఈ గ్రామానికి రూపాంతరాలు ఉన్నాయి. 

మూల విరాట్ వైభవం 
పట్టాభిరామాలయం ఉత్తర ముఖంగా ఉంది. శ్రీరాముడు శివభక్తుడు కావడంతో వాల్మీకిపురం శివకేశవ అభేద క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీరాముడి చేతిలో ఖడ్గం ఉండడం వల్ల శ్రీరాముని ప్రతాప రాముడుగా పిలుస్తారు. తొలి వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన కీర్తనల్లో కూడా ‘‘వితత వావిల పాటి వీర ప్రతాప రామ’’ అనే సంబోధన ఉంది. అన్నమయ్య కూడా దాదాపు 32 కీర్తనలు పట్టాభిరాముడిపై రచిం చారు. 

రాజగోపురం, మహాద్వారం శ్రీకృష ్ణదేవరాయల శిల్పి శైలి తోనూ, మూల విరాట్ విమానం చోళ శైలిలోనూ నిర్మించారు. రెడ్డిరాజుల పాలన, ఆంగ్లేయుల పరిపాలనలోనూ ఈ దేవాలయం ఎంతో విరాజిల్లింది. కడప కలెక్టర్ హార్డ్‌హార్డింగ్ 1950వ సంవత్సరంలో ఇక్కడి పట్టాభిరామ ఆలయాన్ని దర్శించారు. ఆయనకు గల దీర్ఘవ్యాధి ఉపశమించడంతో ముఖ మండపాన్ని నిర్మించారు. ఆలయంలో ఈ మండపంపై హార్డ్‌హార్డింగ్ పేరు నేటికీ మనకు కనిపిస్తుంది. 

అమ్మవారికి అధిక ప్రాధాన్యం
దేశమంతా శ్రీరామ నవమి రోజున సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. కానీ వాల్మీకిపురం పుణ్యక్షేత్రంలో అమ్మవారి నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున సీతారాముల కల్యాణ మహోత్సవాలు నిర్వహించడం విశేషం.

Published in: on April 8, 2011 at 4:39 am  Comments (1)  

గరుడ వాహనంపై తేజోమయుడు

గరుడ వాహనంపై తేజోమయుడు
తిరుపతి , ఏప్రిల్ 6 :
ధర్మపాలనా రక్షకుడు, దివ్య తేజోమయుడైన శ్రీరామచంద్రమూర్తి గరుడవాహనంపై విహరించి భక్తులను కనువిందు చేశారు. శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి గరుడ వాహనసేవను నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, భక్తుల శ్రీరామ నామ కుసుమాంజలి నడుమ స్వామివారి గరుడసేవ నేత్రానందాన్ని కలిగించింది. అంతకుముందు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామిని పాలు, పెరుగు, నారికేళ జలం వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం పట్టుపీతాంబరాలు వజ్రవైడూర్యాలు, స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. విశేష అలంకరణలో ఉన్న ఉత్సవర్లను వేంచేపుగా ఊంజల మండపానికి తీసుకువచ్చారు.

గంటపాటు స్వామివారికి నిర్వహించిన ఉయ్యాలసేవ భక్తులను కనువిందు చేసింది. అనంతరం శ్రీరామచంద్రమూర్తి అలంకరణలో ఉన్న కోదండరామున్ని గరుడవాహనంపై కొలువుంచి కోదండరామస్వామిని నాలుగు మాడ వీధుల్లో విహరింపచేశారు. దారి పొడవునా భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉదయం సతీసోదర సమేత శ్రీకోదండరామస్వామిని పల్లకీ ఉత్సవసేవ కన్నుల పండువగా నిర్వహించారు.

 

Published in: on April 8, 2011 at 4:33 am  Leave a Comment  

శ్రీవారి ఆలయంలో 12న శ్రీరామనవమి ఆస్థానం

శ్రీవారి ఆలయంలో 12న శ్రీరామనవమి ఆస్థానం
తిరుమల , ఏప్రిల్ 7 :
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 12న శ్రీరామనవమి ఆస్థానం జరగనుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని సీతారామలక్ష్మణ మూర్తులను స్వర్ణాభరణాలు, వస్త్ర, పుష్పమాలలతో అలంకరించి సాయంత్రం బంగారువాకిలిలోకి వేంచేపుచేస్తారు. మరో పీఠంపై ఆంజనేయస్వామిని ఆశీనులు చేస్తారు. అనంతరం స్వామివార్లకు శాస్త్రోక్తంగా ఆస్థానం, అక్షితారోపణ తదితర పూజాకార్యక్రమాలను నిర్వహిస్తారు. పది గంటలకు శ్రీరామజన్మ వృత్తాంతాన్ని పౌరాణికులు పఠించడంతో ఆస్థానం ముగుస్తుంది. ఈ సందర్భంగా 12, 13 తేదీల్లో వసంతోత్సవం, ఎస్డీసేవలను రద్దు చేశారు.
Published in: on April 8, 2011 at 4:29 am  Leave a Comment  

హనుమంతు , గజ వాహనాలపై విహరించిన తేజోమయుడు

హనుమంతు , గజ వాహనాలపై విహరించిన తేజోమయుడు
తిరుపతి , ఏప్రిల్ 7 :
ధర్మపాలనాదక్షుడైన శ్రీ రామచంద్రుడు బుధవారం ఉదయం హనుమంతు , రాత్రి గజ వాహనాలపై విహరించారు. శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష అలంకరణతో స్వామివారు గజవాహనంపై ఆశీనులై భక్తుల శ్రీరామనామ కుసుమాంజలి నడుమ నాలుగు మాడ వీధులలో విహరించారు. అంతకు ముందు సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామిని సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తదుపరి పట్టు పీతాంబరాలు , వజ్ర , వైడూర్యాలు , స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు.

విశేష అలంకరణలోని ఉత్సవర్లకు ఊంజల్‌సేవ నిర్వహించారు. ఇక ఉదయం స్వామివారు హనుమంతు వాహనంపై విహరించారు. బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం 8 నుంచి సూర్యప్రభ , రాత్రి 8.30 నుంచి చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతారు.

 

Published in: on April 8, 2011 at 4:26 am  Leave a Comment